సాక్షి,న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చివేసిందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఉగ్రమూకలకు నిధులు, శిక్షణను అందించి భారత్‌పైకి ఉసిగొల్పుతోందని వ్యాఖ్యానించారు. మతంతో ఉగ్రవాదాన్ని ముడిపెడుతున్న ఆ దేశం ప్రజల్లో చీలికలు తెస్తోందని అన్నారు. ఏ మతం నుంచీ ఉగ్రవాదిని చూడాలని భారత్ కోరుకోదని, ఉగ్రవాదం మానవాళికి శత్రువని బీఎస్‌ఎఫ్ 52వ రైజింగ్ డే సందర్భంగా భద్రతా దళాలను ఉద్దేశించి మాట్లాడారు.
పొరుగుదేశంతో సఖ్యతగా మెలిగేందుకు ప్రభుత్వం చొరవ చూపుతున్నా మన భూభాగంలో అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. పాక్, బంగ్లా సరిహద్దుల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని బీఎస్‌ఎఫ్ దళాలను వెంకయ్యనాయుడు ప్రశంసించారు. భారత్ అందరితో మెరుగైన సంబంధాలను కాంక్షిస్తూ వసుధైక కుటుంబాన్ని కోరుకుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment