రాష్ట్ర విభజనకు సంబంధించిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈరోజు ఉదయం 11.30గంటలకు సమావేశం కానుంది.
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఈరోజు ఉదయం 11.30గంటలకు సమావేశం కానుంది. విభజన సిపార్సులపై జీవోఎం సభ్యులంతా సమావేశమై నివేదికను ఖరారు చేసి ఆమోదించనున్నారు. మరోవైపు గురువారం సాయంత్రంగా జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం నేడు జైపూర్ పర్యటనకు వెళుతున్నారు. దాంతో వచ్చేవారంలో తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. కాగా రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు.