తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంటోని కమిటీ ఎందుకని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ వ్యవహారశైలిన తప్పుబట్టారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి చిదంబరం వివరణపై ఆయన మండిపడ్డారు. ఇప్పటి వరకూ ఆంటోనీ కమిటీపై స్పష్టత లేదని వెంకయ్యనాయుడు అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయం మేరకే తెలంగాణ ఏర్పడిందని చెబుతున్న కాంగ్రెస్ నేతలు..ఎవరితో సంప్రదించి ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎంపీలు తమని విశ్వాసంలోకి తీసుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Published Tue, Aug 13 2013 5:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement