సీఎం కిరణ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక హక్కు కిరణ్కుమార్ రెడ్డికి ఎంత మాత్రం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ సీఎం కిరణ్పై నిప్పులు కక్కారు. ఆంటోని కమిటీ ఎదుట హాజరైన సీఎం కిరణ్ అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
సీఎం కిరణ్కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దమ్ముంటే తమతో చర్చకు రావాలని కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం కిరణ్కు సవాల్ విసిరారు. అబద్దాలు మాట్లాడే కిరణ్ మంత్రి వర్గంలో ఎలా కొనసాగుతున్నారని ఈ సందర్భంగా టి.మంత్రులను
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు.