హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఏకే ఆంటోనీ కమిటీ ముందు వాదనలు వినిపించే నేతల జాబితాపై ఈ సమావేశంలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర రక్షణశాఖ మంత్రి ఏకె ఆంటోనీ ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు టీఆర్ఎస్ మాజీ నేతలు విజయ రామారావు, చంద్రశేఖర్ ఈరోజు ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. విజయరామారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.