అన్ని డిమాండ్లపై ఆంటోనీ కమిటీ చర్చ: దిగ్విజయ్
ఢిల్లీ : రాష్ట్ర విభజనకు సంబంధించి అందరి డిమాండ్లను ఆంటోని కమిటీ చర్చిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణకు అన్ని పార్టీ అనుకూలంగా చెప్పాయన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం
తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయంమార్చుకుంటే తామేమీ చేయాలి? అని ఆయన ప్రశ్నించారు.
రాయల తెలంగాణ, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం లాంటి అంశాలు కూడా ఆంటోని కమిటి ముందు చర్చకు వస్తున్నట్లు తెలిపారు. వీటిన్నింటిపై ఆంటోని కమిటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
సమ్మెపై సీమాంధ్ర ఉద్యోగులు పునరాలోచించుకోవాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. విద్యార్ధుల కౌన్సెలింగ్‌కు ఆటంకం కలిగించొద్దన్నారు.