
విభజనను ప్రైవేటు వ్యవహారంలా చూస్తోంది: వెంకయ్య నాయుడు
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీరు.. ‘కేక్ తినాలి. చేతిలోనే ఉండాలి’ అన్న చందంగా ఉందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ ప్రైవేటు వ్యవహారంలా మార్చుకుందని విమర్శించారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీరు.. ‘కేక్ తినాలి. చేతిలోనే ఉండాలి’ అన్న చందంగా ఉందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ ప్రైవేటు వ్యవహారంలా మార్చుకుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధికార విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ‘ప్రక్రియ’ కాంగ్రెస్‌దని, వచ్చే ప్రభుత్వం ‘క్రియ’ చేస్తుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో ఆర్థికమంత్రి చిదంబరం చేసిన ప్రకటనతో తెలంగాణపై అనుమానాలొస్తున్నాయన్నారు. ఆంటోనీ కమిటీపైనా స్పష్టత లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రక్రియపై సుదీర్ఘ చర్చ కొనసాగిన తర్వాత ఆంటోనీ కమిటీ ఎందుకని, దానికున్న చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించారు.