
రోజుకో పాలన... రోజుకో లీకు...కాంగ్రెస్ తీరు: వెంకయ్య
10 జిల్లాలతో కూడిన తెలంగాణాకే తమ పార్టీ కట్టుబడి ఉందని భారతీయ జనతాపార్టీ నేత ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ.. సీఎం కిరణ్ అనుసరిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నారని సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించిన సంగతిని వెంకయ్యనాయుడు ఈ సందర్బంగా గుర్తు చేశారు.
అర్టికల్ -370పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అంటే కాంగ్రెస్కు వణుకు పుడుతుందని ఆయన ఎద్దేవా చేశారు. రోజుకో పాలన... రోజుకో లీకు... కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మరిందని వెంకయ్యనాయుడు ఆరోపించారు.