ముందే ఊహించి మాట్లాడను: బొత్స | Will say only if any thing happens, says Botsa satyanarayana | Sakshi
Sakshi News home page

ముందే ఊహించి మాట్లాడను: బొత్స

Published Thu, Oct 3 2013 11:50 AM | Last Updated on Sat, Aug 11 2018 6:56 PM

ముందే ఊహించి మాట్లాడను: బొత్స - Sakshi

ముందే ఊహించి మాట్లాడను: బొత్స

హైదరాబాద్ : తెలంగాణపై కేబినెట్ నోట్పై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఏదైనా జరిగాకే మాట్లాడానని.... ముందే ఊహించి మాట్లాడనని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణ నోట్కు ముందే ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి వచ్చి ఉంటే బాగుండేదని బొత్స అభిప్రాయపడ్డారు.

మరోవైపు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటున్న సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు.... అందుకోసం రాజీనామాలు మాత్రం చేసేది లేదంటున్నారు. విభజన వల్ల తలెత్తే సమస్యల పరిష్కరానికి కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని  హై కమాండ్‌ను కోరుతున్నారు.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గేది లేదని హై కమాండ్‌ స్పష్టం చేస్తున్న నేపధ్యంలో సేవ్‌ ఎపి.... సేవ్‌ కాంగ్రెస్‌ అంటున్న నేతలు తమ భవిష్యత్తు కార్యచరణను రూపొందించుకునేందుకు వారంతా మినిస్టర్స్ క్వార్టర్స్లో సమావేశం అయ్యారు. 33మంది ఎమ్మెల్యేలు...తొమ్మిది మంది ఎమ్మెల్సీలు...పలువురు మంత్రులు, ఎంపీలు ఈ భేటీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement