ఆంటోనీ పర్యటనపై దిగ్విజయ్‌తో బొత్స చర్చ | botsa satyanarayana discussion with digvijay singh | Sakshi
Sakshi News home page

ఆంటోనీ పర్యటనపై దిగ్విజయ్‌తో బొత్స చర్చ

Published Sun, Sep 22 2013 1:35 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

botsa satyanarayana discussion with digvijay singh

సాక్షి, న్యూఢిల్లీ:  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయుణ శనివారం సాయుంత్రం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు.ఈ సమావేశంలో సమైక్యాంధ్ర ఉద్యవుం, రాజకీయుంగా పార్టీకి జరుగుతున్న నష్టంపై దిగ్విజయ్‌కి బొత్స వివరించినట్టు తెలిసింది. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో ప్రజా జీవనం అస్తవ్యస్తమైందని, ప్రజలకు ఉపశవునం కలిగించే ప్రకటన చేయూలని బొత్స కోరినట్టు సమాచారం.

 

ఆంటోనీ కమిటీ సభ్యులుగా వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ రాష్ట్రంలో పర్యటించే అంశంపై కూడా చర్చించినట్టు తెలిసింది. ఈ నెల చివరికల్లా తాను, మెయిలీ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు ఉన్నాయుని, ఏఏ ప్రాంతాల్లో పర్యటించాలో, సూచించాలని బొత్సను దిగ్విజయ్ కోరినట్టు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement