ఆంటోనీ కమిటీని పంపమని సోనియాను కోరిన బొత్స | Botsa Satyanarayana requests Sonia Gandhi to send Antony Committee | Sakshi
Sakshi News home page

ఆంటోనీ కమిటీని పంపమని సోనియాను కోరిన బొత్స

Published Sun, Sep 29 2013 6:23 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ఆంటోనీ కమిటీని పంపమని సోనియాను కోరిన బొత్స - Sakshi

ఆంటోనీ కమిటీని పంపమని సోనియాను కోరిన బొత్స

న్యూఢిల్లీ: ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపమని  ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. రాష్ట్ర విభజన అంశంపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా ఆంటోనీ కమిటీని రాష్ట్రానికి పంపాలని ఆయన సోనియాకు విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ అనారోగ్యంతో ఉన్నందున కమిటీలోని మిగిలిన ముగ్గురు సభ్యులను రాష్ట్రానికి  పంపాలని కోరారు.

బొత్స సత్యనారాయణ ఢిల్లీలో ఆంటోనీ కమిటీ సభ్యుడు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు  దిగ్విజయ్‌ సింగ్ను కలిశారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆయనకు వివరించారు.  తెలంగాణ నోట్‌ కేంద్ర మంత్రి మండలి ముందుకు రాకముందే రాష్ట్రానికి రావాలని ఆయనను  కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement