జేసీ దివాకరరెడ్డిని బహిష్కరించండి: బొత్స
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకరరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని హైకమాండ్ కు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ లేఖ రాశారు. అనారోగ్యంతో గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న బొత్స సత్యనారాయణ.. జేసీపై నిప్పులు చెరిగారు. జేసీ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని బొత్స వ్యాఖ్యానించారు. బొత్సపై చర్యలు తీసుకోవాలని హైకమాండ్‌కు లేఖ రాశాను అని ఆయన అన్నాడు.
జేసీకి వేరే పార్టీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లొవచ్చు అని బొత్స సూచించాడు. ఆరుగురు సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాసానికి మద్దతిస్తామనడం సరికాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ ఎంపీలు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే ఇప్పటివరకు అనలేదు అని బొత్స తెలిపారు.