సంతకాలు చేస్తే అనర్హత వేటు : బొత్స హెచ్చరిక | Botsa Satyanarayana warning Congress MLAs | Sakshi
Sakshi News home page

సంతకాలు చేస్తే అనర్హత వేటు : బొత్స హెచ్చరిక

Published Thu, Jan 23 2014 11:53 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

బొత్స సత్యనారాయణ - Sakshi

బొత్స సత్యనారాయణ

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీపై అసెంబ్లీ ఇన్నర్ లాబీలో ఆసక్తికర సంభాషణలు జరుగుతున్నాయి. రెబెల్‌ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలపై సంతకాలు ఎందుకు చేశావని ఎంఎల్‌ఏ రౌతు సూర్యప్రకాష్‌ను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  అడిగారు.  సంతకాలు చేస్తే మీరే ఇబ్బందుల పాలవుతారని,  అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు.  

పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా రెబెల్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడానికి సరిపడా శాసనసభ్యుల సంతకాలు సేకరించినట్లు మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఖరారు చేసే అభ్యర్థిని బట్టి తమ వ్యూహాన్ని రూపొందించుకుంటామన్నారు.  జేసీ అడిగారు అందుకే సంతకం చేశానని కాంగ్రెస్ ఎంఎల్‌ఏ బండారు సత్యానందరావు చెప్పారు.  తమ జిల్లా ఎంఎల్‌ఏలు 11 మందిసంతకాలు చేశారని, ఏం జరుగుతుందో  చూద్దామని బండారు అన్నారు. దీంతో రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై సీమాంధ్ర కాంగ్రెస్‌లో వివాదం రాజుకుంటున్నయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement