Bandaru Satyananda Rao
-
కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తోంది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుండగా ఆ పార్టీని వీడేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు వీరి బాటలో పయనించే అవకాశముంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే అధిష్టానాన్ని ధిక్కరించారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసి హైకమాండ్ కు సవాల్ విసిరారు. సీఎం జోక్యంతో కిరణ్ చివరకు పోటీ నుంచి తప్పుకున్నారు. -
సంతకాలు చేస్తే అనర్హత వేటు : బొత్స హెచ్చరిక
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీపై అసెంబ్లీ ఇన్నర్ లాబీలో ఆసక్తికర సంభాషణలు జరుగుతున్నాయి. రెబెల్ అభ్యర్థి నామినేషన్ పత్రాలపై సంతకాలు ఎందుకు చేశావని ఎంఎల్ఏ రౌతు సూర్యప్రకాష్‌ను పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అడిగారు. సంతకాలు చేస్తే మీరే ఇబ్బందుల పాలవుతారని, అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి సరిపడా శాసనసభ్యుల సంతకాలు సేకరించినట్లు మాజీ మంత్రి జెసి దివాకర రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసే అభ్యర్థిని బట్టి తమ వ్యూహాన్ని రూపొందించుకుంటామన్నారు. జేసీ అడిగారు అందుకే సంతకం చేశానని కాంగ్రెస్ ఎంఎల్ఏ బండారు సత్యానందరావు చెప్పారు. తమ జిల్లా ఎంఎల్ఏలు 11 మందిసంతకాలు చేశారని, ఏం జరుగుతుందో చూద్దామని బండారు అన్నారు. దీంతో రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై సీమాంధ్ర కాంగ్రెస్‌లో వివాదం రాజుకుంటున్నయింది.