కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా! | three seemandhra mlas to quit congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!

Published Thu, Feb 13 2014 11:41 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా! - Sakshi

కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!

హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో కాక పుట్టిస్తోంది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుండగా ఆ పార్టీని వీడేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.

ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్‌ కృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు వీరి బాటలో పయనించే అవకాశముంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే అధిష్టానాన్ని ధిక్కరించారు. మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో  తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసి హైకమాండ్ కు సవాల్ విసిరారు.  సీఎం జోక్యంతో కిరణ్ చివరకు పోటీ నుంచి తప్పుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement