కాంగ్రెస్ లో ఉండాలా, లేదా అనేది ఇంకా డిసైడ్ కాలేదు: జేసీ
కాంగ్రెస్ లో ఉండాలా, లేదా అనేది ఇంకా డిసైడ్ కాలేదు: జేసీ
Published Tue, Dec 24 2013 1:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
కాంగ్రెస్ పార్టీలో ఇంకా కొనసాగాలా లేదా వెళ్లిపోవాలా అనే అంశాన్ని తాను ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. నా సోదరుడు, కుమారుడు ఏ పార్టీలో చేరతారనేది వారి ఇష్టం అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడుతున్నది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన అంశంలో తెలుగుదేశం పార్టీది రెండు కళ్ల సిద్దాంతం అని జేసీ విమర్శించారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పటికే ఓ కన్ను లొట్టబోయింది, ఇక సమైక్యాంధ్ర అనకపోతే రెండో కన్ను కూడ పోతుంది జేసీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి క్రమశిక్షణ లేఖ అందలేదు అని ఆయన తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు తనను పార్టీ నుంచి వెళ్లి పొమ్మంటున్నాడు అని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సోనియాపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ బొత్స సీరియస్ అయ్యారు.
Advertisement