సోనియాకు మంత్రి బొత్స తొత్తు | botsa satyanarayana division in favor state with Congress Sonia Gandhi successors | Sakshi
Sakshi News home page

సోనియాకు మంత్రి బొత్స తొత్తు

Published Fri, Jan 31 2014 1:17 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

botsa satyanarayana division in favor state with Congress Sonia Gandhi successors

విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మంత్రి బొత్స సోనియాగాంధీకి తొత్తుగా వ్యవహరించి రాష్ట్ర విభజనకు అనుకూలంగా పని చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ధ్వజమెత్తారు. సమైక్యాంధ్రకు మ ద్దతుగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అసెంబ్లీ లో ఓటు వేయాలని డిమాండ్ చేస్తూ  కాంగ్రెస్ ఎంఎల్‌ఏలు, మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని టీడీపీ గురువారం నిర్వహించింది. ఈ మేరకు ఉదయం 11గంటల సమయంలో టీడీ పీ నాయకులు విజయనగరంలోని మూడు లాంతర్లు సమీపంలో మంత్రి నివాసం ముందు నిరసన చేపట్టారు. ఆ తర్వాత లోపలికి వెళ్లేందు కు యత్నించారు. దీనికి పోలీసులు అనుమతిం చక పోవడంతో సుమారు గంటపాటు నిరసన చేసి 12గంటల సమయంలో  అక్కడినుంచి వెళ్లిపోయారు. 
 
ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడు తూ మంత్రి ఏ మాట చెప్పినా ప్రజలు నమ్మే  స్థితిలో లేరన్నారు. మంత్రి  బొత్స సమైక్యాం ధ్ర ఉద్యమం కోసం అసెంబ్లీలో కనీసం మా ట్లాడకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలోపార్టీ జిల్లా ప్రధాన కా ర్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మన్యాలకృష్ణ, ఎన్‌ఎన్‌ఎం.రాజు, విజ్జపు ప్రసాద్, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకటనరసింగరావు, పార్టీ అధికార ప్రతినిధి కనకల మురళీమోహన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ప్రసాదుల రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు సైలాడ త్రినాథరావు, మోహనరావు, గేదెల ఆదిబాబు, తెలుగు యువత నా యకులు మైల పల్లి పైడిరాజు, గుండెల ప్రకాశరావు, కోండ్రు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
తుస్సుమన్న మంత్రి ఇంటి ముట్టడి  
సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి ఇంటిని  ముట్టడిస్తామని బీరాలు పలికిన టీడీపీ నాయకులు కార్యక్రమాన్ని తుస్సుమనిపించారు. ఎటువంటి ఆటంకాలు ఎదురైనా మంత్రి ఇంటి ని ముట్టడించి తీరుతామని చెప్పిన నాయకులు తక్కువ మందితో రోడ్డు మీద కూర్చుని మమ అనిపించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు,కార్యకర్తలు కలిపి సుమారు 50 మంది వరకు మాత్రమే రావడం విశేషం. పోలీసులు, జర్నలిస్టులు ఎక్కువ సంఖ్యలో కనిపించారు తప్ప పార్టీ నాయకులే కనిపించక పోవడం విడ్డూరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement