'బొత్సకు ముఖ్యమంత్రి కావాలని తహతహ'
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ శనివారం ఆంటోనీ కమిటీకి బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ను ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని.... హైదరాబాద్లో వచ్చే ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు పంచాలని కిషోర్ చంద్రదేవ్ విజ్ఞప్తి చేశారు.
అంతే కాకుండా కిషోర్ చంద్రదేవ్... తన లేఖలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ధ్వజమెత్తారు. సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని బొత్స సత్యనారాయణ తహతహలాడుతున్నారని విమర్శించారు. సీఎం కిరణ్ మిగిలిన పదవీ కాలాన్ని అనుభవించాలనుకుంటున్నారని కిషోర్ చంద్రదేవ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి గులాం నబీ ఆజాదే కారణమని వ్యాఖ్యలు చేశారు. ఆయన కేవలం తెలంగాణ నేతలు, పీసీసీ అధ్యక్షుడితో మాత్రమే మాట్లాడారని మండిపడ్డారు.