
'పార్టీ నేతల్లో అపోహలు తొలగించేందుకు కమిటీ'
ఢిల్లీ:పార్టీ నేతల్లో ఏర్పడిన అపోహలను తొలగించేందుకు ఆంటోని కమిటీ ఏర్పాటు చేసినట్లు ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. విభజన ప్రక్రియపై నెలకొన్న అపోహలపై ఆయన బుధవారం ఆచితూచి స్పందించారు. విభజన ప్రక్రియ ఆగిందా.. లేదా అనేది కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్‌ను అడిగితే తెలుస్తుందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు విభజనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు టీడీపీ ఎంపీలు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహిరిస్తే టిక్కెట్టు ఇవ్వనన్న చంద్రబాబు నాయుడు ఆ ఎంపీలపై ఏం చర్యలు తీసుకుంటారని పొన్నం ప్రశ్నించారు.