నేను నిస్సహాయుడిని: కేంద్ర మంత్రి కావూరి | I am helpless : Says Kavuri Sambasiva Rao | Sakshi
Sakshi News home page

నేను నిస్సహాయుడిని: కేంద్ర మంత్రి కావూరి

Published Wed, Aug 7 2013 6:56 PM | Last Updated on Wed, Aug 15 2018 7:45 PM

నేను నిస్సహాయుడిని: కేంద్ర మంత్రి కావూరి - Sakshi

నేను నిస్సహాయుడిని: కేంద్ర మంత్రి కావూరి

ఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో తాను నిస్సహాయుడినని, ఎవరైనా ఏమైనా అనుకోండని   కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో  కావూరి స్పందన తీరు ఈ విధంగా ఉంది. తెలంగాణ ప్రకటన తర్వాత తాను మాట్లాడ లేదన్న అపవాదు ఉంటే ఉండనీయండి అని అన్నారు. తనకు స్పష్టత ఉందని, తనకు విశ్వసనీయత ఉందని కావూరి చెప్పారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన తరువాత కావూరి ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఏలూరులోని ఆయన నివాసంపై దాడి కూడా చేశారు.  కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తరువాత కావూరి  సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో చల్లబడిపోయినట్లు విమర్శ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement