helpless
-
ఆమె వేదన.. అరణ్య రోదన.!
► మంటగలిసిన మానవత్వం ► నిస్సహాయ స్థితిలో ప్రసవించిన అభాగ్యురాలు ► కులజాడ్యంతో సహాయానికి రాని గ్రామస్తులు, బంధువులు సాటి మనుషులు, బంధువులే ఆమె పరిస్థితిని చూసి చలించకపోతే.. ఆ అభాగ్యురాలి ఆవేదన ఏ దూరతీరాలకు చేరగలదు. ఆ దీనురాలు ఏ భగవంతునికి నివేదించు కోగలదు. మానవత్వం మంట గలిసిన సమాజంలో కన్నీటి బాధను పంటి బిగువున భరించడం తప్ప ఆమె సమాజాన్ని ఏమని ప్రశ్నించగలదు. ప్రసవ వేదన అనుభవిస్తున్న ఓ యువతి ఎంత వేడుకున్నా ఏ ఒక్కరూ సాయమందించక పోవడంతో చివరికి ఆమె ఏం చేసిందంటే.. జయపురం, మల్కన్‌గిరి(ఒడిశా): మానవులందరి జననం ఒకటే అయితే.. కొంతమంది తమ స్వార్థం కోసం మతాలు, కులాలు, జాతులు, సృష్టించి మానవజాతిని ముక్కముక్కలుగా విభజించారు. ఆ జాడ్యం నేడు సమాజంలో మానవత్వాన్ని మంటగలుపుతోంది. అటువంటి సంఘటనే సోమవారం సాయంత్రం కొరాపుట్ జిల్లాలోని మత్తిలి సమితిలో జరిగింది. రెండు కులాలకు చెందిన ప్రేమికుల జంటను గ్రామస్తులు ఊరినుంచి వెలివేసి సహాయ నిరాకరణ అమలు చేయడంతో నిండు గర్భిణి అయిన యువతి పురిటినొప్పులకు ఓర్వలేక సహాయం కోసం హృదయవిదారకంగా ఏడ్చినా ఆమె గోడును గ్రామస్తులు, బంధువులు పట్టించుకోలేదు. ఆమె ఆర్తనాదాన్ని విన్నప్పటికీ తమను కూడా వెలివేస్తారన్న భయంతో సాయం చేసేందుకు ధైర్యం చేయలేదు. చివరికి ఆ యువతి ప్రసవనొప్పులు తాళలేక సమీప అడవిలోకి పరుగులు తీసింది. ఎట్టకేలకు ఆ అడవిలోనే కవల పిల్లలను ప్రసవించింది. ఆఖరికి బిడ్డలు బొడ్డులు కోసేందుకు కూడా ఎవరూ దరి చేరలేదు. ఈ అమానుష సంఘటన అవిభక్త కొరాపుట్ జిల్లా మత్తిలి సమితి దొలపొడిగుడ పంచాయతీ కెందుగుడ గ్రామంలో జరిగింది. ఊరికి దూరంగా బతికిన ప్రేమికులు గ్రామానికి చెందిన త్రిలోచన హరిజన్ అనే యువకుడు రెండేళ్ల కిందట మత్తిలిలోని కమరవీధికి చెందిన రతన్కమార్ కుమార్తె గౌరీకమార్ (19)తో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరివీ వేర్వేరు కులాలు కావడం వల్ల గౌరి తమ కులం కన్నా తక్కువ కులానికి చెందినదని భావించిన త్రిలోచన హరిజన్ తల్లిదండ్రులు, ఆ గ్రామస్తులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. అంతేకాకుండా ఆ ప్రేమికుల జంటను ఊరినుంచి వెలివేశారు. వారితో కలవకూడదని ఎటువంటి సహాయం చేయకూడదని ఆలా చేసిన వారికి కూడా అదేగతి పడుతుందని గ్రామ ప్రజలను హెచ్చరించారు. కులం కన్నా తమ ప్రేమ గొప్పదని..ప్రేమను బతికించుకుని కలిసి జీవిస్తామన్న పట్టుదలతో ఆ ప్రేమ జంట ఊరికి దూరంగా ఒక పాక వేసుకుని అందులో కాపురం పెట్టారు. కాలం గడుస్తోంది. గౌరి గర్భం దాల్చింది. గర్భిణిగా ఆమె ఎటువంటి సౌకర్యాలకు నోచుకోలేదు. బిడ్డను కంటానన్న తృప్తి, పట్టుదల ఆమెలో ఉండేది. నవమాసాలు నిండాయి. సోమవారం మధ్యాహ్నం ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తన ప్రసవానికి సమయం అయిందని ఆమె గ్రహించింది.అటువంటి సమయంలో ఎవరో ఒకరైనా తనకు సహాయం ఉండాలన్న ఆశ ఆమెలో పొడసూపింది. కానీ వెలికి గురైన ఆమెకు ఎవరు సహకరిస్తారు? సోమవారం సాయంత్రం ఆమెకు నొప్పులు ఎక్కవయ్యాయి. ఆ సమయంలో భర్త ఇంటిలో లేడు, కూలి పనులకు బయటకు వెళ్లాడు. సహాయం అర్ధించేందుకు రోడ్డుపైకి వచ్చి తనకు సహాయం చేయండని కనిపించిన కెందుగుడ గ్రామ ప్రజలను వేడుకుంది. బతిమాలింది. విలపించింది. అర్ధించింది. అయినా ఎవరి మనసూ కరగలేదు. ఆమె పడుతున్న ప్రసవ వేదన చూసిన కొంతమందికి సహాయం చేయాలని ఉన్నా వెలివేత భయం వారి మానవత్వాన్ని మంట గలిపింది. చివరికి ఎవరి సహాయం అందకపోవడంతో ఆమె సమీప అడవిలోకి వెళ్లింది. అప్పటికే నొప్పులు తీవ్రమయ్యాయి ఇక భరించలేని ఆమె అడవిలో ఓ వస్త్రం పరిచి దానిపై పడిపోయి అతికష్టంపై ప్రసవించింది. ఆస్పత్రిలో కోలుకుంటున్న తల్లీబిడ్డలు అంత బాధలోనూ ఆమె ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే బిడ్డల బొడ్డు కోసేందుకు ఎవరూ లేరు. అలా ఆమె మూడు గంటల పాçటు అడవిలో పసికందులతో నిస్సహాయ స్థితిలో పడి ఉంది. ఈ విషయం తెలిసిన కెందుగుడ గ్రామంలోని ఆశావర్కర్ విజయ లక్ష్మి త్రిపాఠి హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పిల్లల బొడ్డు కోసి అంబులెన్స్‌కు ఫోన్ చేయగా 108 అంబులెన్స్ వచ్చి గౌరిని, బిడ్డలను మత్తిలి ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో తల్లీబిడ్డలు కోలుకుంటున్నారు. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది. -
తిట్టిన వారికీ దీవెనలే!
వలస వచ్చిన విశ్వాసుల్లో అబూ తాలిబ్ తనయుడు హజ్రత్ జాఫర్ రజీ, చక్రవర్తి ప్రశ్నలకు సమాధానాలిస్తూ, ‘మహారాజా! మేము పూర్వం చాలా అజ్ఞానంగా ఉండేవాళ్ళం. విగ్రహారాధన చేసేవాళ్ళం. సారాయి, జూదం, అశ్లీలతల రొచ్చులో కూరుకు పోయి ఉండేవాళ్ళం. చచ్చిన జంతువులను తినేవాళ్ళం. పగలు, ప్రతీకారాలతో రగిలిపోతూ ఒకళ్ళనొకరు చంపుకునేవాళ్ళం. కక్షలు, కార్పణ్యాల పరంపర తరతరాలుగా కొనసాగేది. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మాపై దయ దలిచాడు. మాలోనే ఒక ప్రవక్తను ప్రభవింపజేశాడు. ఆయనది ఎంతో గౌరవప్రదమైన వంశం. ఆయనగారి నీతి నిజాయితీ, సత్యసంధత మాకు మొదటి నుండీ తెలుసు. ఆయన మమ్మల్ని సత్యం వైపు, ధర్మం వైపు పిలిచాడు. దేవుని సందేశం మాకు బోధించాడు. సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యమే పలకాలనీ, జాలి, దయ, పరోపకారం లాంటి సుగుణాలు కలిగి ఉండాలనీ, సాటి మానవుల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనీ, బంధువుల హక్కులు నెరవేర్చాలనీ, అనాధలను ఆదరించాలనీ, వారిసొమ్ము కబళించకూడదనీ, శీలవతులపై అపనిందలు మోపకూడదనీ, దానధర్మాలు చేస్తూ ఉండాలనీ ఆయన మాకు బోధించాడు. మేమాయన మాటలు విని, ఆయనను అనుసరిస్తున్న కారణంగా మా వాళ్ళు మమ్మల్ని హింసించడం ప్రారంభించారు. వారి దౌర్జన్యాలు భరించలేక, ఇక్కడైనా కాస్త ప్రశాంతంగా బ్రతకవచ్చని మీ దేశంలో తలదాచుకున్నాం. ఇదే మేము చేసిన నేరం’ అన్నారు. తరువాత జాఫర్ ద్వారా కొన్ని ఖురాన్ వాక్యాలు కూడా చదివించుకొని విన్నాడు – నీగస్ చక్రవర్తి. ఈసా ప్రవక్తకు సంబంధించి ఖురాన్ చెప్పిన విషయాలను ధ్రువీకరించాడు. అంటే, ముహమ్మద్ ప్రవక్త(స) వారి సందేశం మహోన్నతమైన నైతిక, మానవీయ ప్రమాణాలతో నిండి ఉందని మనకు అర్థమవుతోంది. జీవితంలోని ప్రతి రంగంలో నీతిని పాటించాలనీ, ఇంట్లోనైనా, వీధిలోనైనా, కార్యాలయాల్లోనైనా, న్యాయస్థానాల్లోనైనా, అధికార పీఠంపైనా ప్రతిచోటా నిజాయితీ, సౌశీల్యం తొణికిసలాడాలనీ, జీవితంలోని ఏ రంగమూ నీతి రహితంగా ఉండకూడదనీ ప్రవక్త అభిలషించారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకూ, మానవీయ సంబంధాల పెంపుదలకూ ఎంతటి ప్రాముఖ్యమిచ్చారో ప్రవక్త జీవితం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రవక్త(స) తన సందేశ కార్యక్రమంలో భాగంగా ‘తాఝెఫ్’ అనే ఊరికి వెళ్ళారు. గ్రామ పెద్దలను కలుసుకొని తన సందేశం వినిపించారు. కానీ వారు చాలా అమర్యాదగా, అమానవీయంగా ప్రవర్తించారు. మంచిని బోధించినందుకు నానా మాటలన్నారు. రౌడీ మూకను ఆయనపైకి ఉసిగొలిపి రక్తసిక్తమయ్యేలా కొట్టించారు. అయినా ప్రవక్త పల్లెత్తుమాట అనలేదు. పర్వతాలపై అదుపు కలిగిన దైవదూతలు ప్రత్యక్షమై, తమరు అనుమతిస్తే రెండు కొండల మధ్య ఉన్న ఈ ఊరిని విసుర్రాయిలో పప్పులు నలిపినట్లు నలిపి పిండి చేస్తామన్నా, ఆ మానవతామూర్తి ససేమిరా ఒప్పుకోలేదు. చెడుకు చెడు సమాధానం కాదని ఉపదేశించారు. తనను హింసించిన వారిని దీవించి, వారికి సద్బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని ప్రార్థించారు. (మిగతాది వచ్చేవారం) -
బలహీనుల ఆశాజ్యోతి
సమస్త సృష్టికీ కర్త అయిన ఏకైక దైవాన్నే ఆరాధించమని ప్రజలకు పిలుపునిచ్చిన మహనీయుడు ముహమ్మద్ ప్రవక్త. తల్లితండ్రులను గౌరవించాలనీ, వారిపట్ల విధేయతా భావం కలిగి ఉండాలనీ, వారి సేవ చేయని వారు నరకానికి పోతారనీ హెచ్చరించారాయన. బంధువులు, బాటసారులు, అనాథలు, వితంతువులు, నిస్సహాయుల పట్ల దయగా ఉండాలని బోధించారు. మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఒక్క ముస్లిమ్ సముదాయానికే కాక సమస్త మానవ జాతికీ సంపూర్ణ మార్గదర్శకులు. ఆయన జన్మదినమైన ‘మిలాద్ –ఉన్–నబీ’ వేళ ఆయన బోధనలపై దృష్టి సారించాలి. సత్యమే పలకాలి. చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి. పలికే ప్రతిమాటకు, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని బాధ్యతా భావాన్ని ప్రవక్త నూరిపోశారు. అన్యాయానికీ, అధర్మ సంపాదనకు ఒడిగట్టవద్దన్నది ఆయన బోధ. అలాగే ధనాన్ని దుర్వినియోగం, దుబారా చేయవద్దని కూడా ఆయన హెచ్చరించారు. వ్యభిచారం దరిదాపులకు కూడా పోవద్దని, ఈ పాపానికి దూరంగా ఉండటమే కాకుండా, దానికై పురిగొలిపే ప్రసారసాధనాల్ని కూడా రూపుమాపాలని పిలుపునిచ్చారు. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపకూడదనీ, ప్రజల ధన, మాన ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిపథంలో పయనించజాలదనీ ఉపదేశించారు. వ్యాపార లావాదేవీలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, లెక్కపత్రాలు, కొలతలు, తూనికలు చాలా ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలని ముహమ్మద్ ప్రవక్త (స) బోధించారు. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలని, తోటి మానవ సోదరుల్ని తమకన్నా తక్కువగా చూడకూడదని ఆయన ఉపదేశించారు. స్త్రీ జాతిని గౌరవించాలనీ, అనాథలను ఆదరించని వారు మహాపాపాత్ములనీ, వారిని ఆదరించి, సంరక్షిస్తే స్వర్గార్హత సాధించవచ్చని ఆయన చెప్పారు. అదేవిధంగా ఖైదీల పట్ల కరుణతో వ్యవహరించాలని, వారిని హింసించకూడదని, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్న అమాయకుల విడుదలకు కృషి చేయాలని ఉపదేశించారు. వితంతువులను చిన్నచూపు చూడకూడదని, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలని, శుభకార్యాల్లో వారిని ఆహ్వానించకపోవడం అన్యాయమని, ఈ దురాచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. అవసరం, అవకాశం ఉన్నవారి పునర్వివాహానికి ప్రయత్నించాలని, వారిని నిర్లక్ష్యం చేసిన సమాజం అథోగతి పాలవుతుందని కూడా ఆయన హెచ్చరించారు. వృద్ధులను ఆదరించాలని హితవు పలికారు. ఒక మార్గదర్శిగా ప్రవక్త (స) బోధించే ప్రతి విషయాన్ని స్వయంగా ఆచరించి చూపేవారు. ఆచరణ లేని హితబోధ జీవం లేని కళేబరం వంటిదని ఆయన చెప్పేవారు. ఆ మహనీయుని మంచితనానికీ, మానవీయ సుగుణానికీ అద్దం పట్టే ఓ సంఘటన... ఇది ముహమ్మద్ ప్రవక్త ధర్మప్రచారం చేస్తున్న తొలినాళ్ళ మాట. ఒకసారి ఆయన మక్కా వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు. ఒక చౌరస్తాలో ఓ వృద్ధురాలు తన మూటాముల్లెతో సహా నిలబడి ఉంది. వృద్ధురాలు కావడంతో మూటల బరువు మోయలేక పరుల సహాయం కోసం అర్థిస్తోంది. దారిన వెళ్ళేవాళ్ళను బతిమాలుతోంది కాస్తంత సాయం చేయమని! చాలామంది ఆ దారిన వెళుతున్నారు కానీ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళుతూ, వృద్ధు్ధరాలిని ఎవరూ పట్టించుకోకపోవడం చూసి, ఆమెను సమీపించారు. ‘అమ్మా! నేను మీకు సహాయం చేస్తాను’ అన్నారు. ‘బాబ్బాబూ! నీకు పుణ్యం ఉంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేకపోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే, నేను వెళ్ళిపోతాను’ అన్నదా వృద్ధురాలు. ‘అయ్యో! దీనికేం భాగ్యం’ అంటూ మూట భుజానికెత్తుకొని, ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త. ‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూమొహం తెలియని నా లాంటి ముసలిదానికి ఇంత సాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా! ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్త మతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా అందుకే ఊరే విడిచి వెళ్ళిపోతున్నాను’ అని హితవు పలికింది. ‘సరేనమ్మా’ అంటూ ఆమె చెప్పినదంతా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ప్రవక్త. ఆ మహనీయుని మంచితనానికీ, వినయపూర్వకమైన ఆ వీడ్కోలుకూ ఆనందభరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై, ‘బాబూ!’ అని పిలిచింది ఆప్యాయంగా. ‘అమ్మా!’ అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, ‘బాబూ! నీ పేరేమిటి నాయనా!’ అని ప్రశ్నించింది ప్రేమగా. కాని ప్రవక్త మాట్లాడకుండా, మౌనం వహించారు. ‘బాబూ! పేరైనా చెప్పునాయనా! కలకాలం గుర్తుంచుకుంటాను’ అంటూ అభ్యర్థించింది. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘అమ్మా! నా పేరు ఏమని చెప్పను ? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ అభాగ్యుణ్ణి నేనేనమ్మా!’ అన్నారు ప్రవక్త మహనీయులు. దీంతో ఒక్కసారిగా ఆ వృద్ధురాలు అవాక్కయిపోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థం కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్నేనా..? నా కళ్ళు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..! ఇలా ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎవరి మాటలు వినకూడదనీ, ఎవరి ముఖం కూడా చూడకూడదనీ పుట్టిపెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు. సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్రముగ్దురాలిని చేశాయి. కళ్ళ నుండి ఆనందబాష్పాలు రాలుతుండగా, ‘బాబూ ముహమ్మద్ ! నువ్వు నిజంగా ముహమ్మద్వే అయితే, నీ నుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను. నీ కారుణ్య ఛాయలోనే సేద దీరుతాను’ అంటూ అదే క్షణాన ప్రవక్త వారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్త మహనీయుని ఆచరణవిధానం. ప్రజల పట్ల, ముఖ్యంగా నిస్సహాయులు, బడుగు, బలహీనులు, పీడిత తాడిత శ్రామిక వర్గాల పట్ల ఆ మహనీయుడు అవలంబించిన ఆచరణ శైలి. ఇందులో ఎంతో కొంతైనా మనం ఆచరించడానికి ప్రయత్నిస్తే నేటి మన సమాజం ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. ఇలా మానవ మహోపకారి ముహమ్మద్ (స) ఊహ తెలిసినప్పటి నుండి అంతిమ శ్వాస వరకు సమాజ సంక్షేమం కోసం, సంస్కరణ కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. మానవాళికి సత్యధర్మాన్ని పరిచయం చేస్తూ, వారి ఇహ పర సాఫల్యాల కోసం అహర్నిశలు శ్రమించారు. ఆ మహనీయుని జీవన విధానం మానవాళికి అంతటికీ ఆదర్శం కావాలి. ప్రజలతో ఆయన ఏవిధంగా ప్రేమానురాగాలతో,స్నేహ సౌహార్దాలతో, సానుభూతితో వ్యవహరించేవారో, అవసరార్థులకు, ఆపదలో ఉన్నవారికి, ఏ విధంగా ఆపన్నహస్తం అందించేవారో, అలాంటి వ్యవహారశైలి నేడు మనలోనూ తొణికిసలాడాలి. ప్రవక్త తన చివరి హజ్‌యాత్ర సందర్భంగా ఇలా అన్నారు... ‘‘ప్రజలారా! ఒక మనిషికి మరో మనిషిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీరు తినేదే మీ సేవకులకు పెట్టండి. కూలివాని చెమట బిందువులు ఆరక ముందే అతని వేతనం చెల్లించండి. మహిళల గురించి దైవానికి భయపడండి. మీకు వారిపై ఎలాంటి హక్కులున్నాయో, ధర్మం ప్రకారం వారికీ మీపై అలాంటి హక్కులే ఉన్నాయి. వడ్డీ తినకండి, దాన్ని త్యజించండి. సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి. ఆయనకు ఎవరి భాగస్వామ్యాన్నీ కల్పించకండి. బాధ్యతాభావం, జవాబుదారీతనం కలిగి ఉండండి. మీ కర్మలన్నింటికీ ఒకనాడు దైవం ముందు సమాధానం చెప్పుకోవాల్సి ఉంది...’’ ఇలా ప్రజానీకానికి అనేక హితోపదేశాలు చేశారు. అవన్నీ మనకు మార్గదర్శకం. రేపు‘మిలాద్–ఉన్–నబీ’ ముహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు -
విధి వంచితులు
సాఫీగా సాగిపోయే చిన్న కుటుంబమది. ఉన్నంతలో గుట్టుగా ఇల్లు గడుపుకొంటూ, ఇలా జీవితం నడిస్తే చాలనుకునే సంసారమది. గాలివాటంలో అలల బాటలో అలనల్లన సాగిపోయే తెరచాప నావ వంటి ఆ కుటుంబంపై విధి పగబట్టింది. సమస్యల అలజడి సష్టించి ఆ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసింది. అనారోగ్యం రూపంలో వారిపై పగబట్టింది. పని చేయాల్సిన భర్త, చదువుకోవాల్సిన కొడుకులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ విలవిల్లాడుతుంటే, గహలక్ష్మి అయిన ఇల్లాలు కూలి పనులు చేసి వారిని సాకాల్సిన దురవస్థ ఏర్పడింది. తగరపువలస: కష్టం ఎవరికైనా కష్టమే కానీ, కష్టపడితేనే కడుపు నిండే ఆ చిరు కుటుంబానికి మాత్రం అది అలవిమాలిన కష్టమయింది. అనారోగ్యం పంజా విసరడంతో ఆ కుటుంబం సుడిగాలిలో చిగురుటాకులా విలవిల్లాడుతోంది. విధి వ్యాధి రూపంలో విరుచుకుపడి తండ్రీ కొడుకులను మంచాన పడేసింది. చెమటోడ్చి సంపాదించాల్సిన భర్త, చదువుకు వెళ్లాల్సిన కుమారులను సాకడానికి కూలి పని చేస్తూ, వారిని ఆస్పత్రులకు తిప్పుతూ ఆ ఇల్లాలు అష్టకష్టాలు పడుతోంది. ఇదీ పరిస్థితి భీమిలి మండలం మజ్జివలసకు చెందిన గువ్వల బంగారుబాబు, ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో అప్పలరాజు ఇంటర్మీడియట్ చదువుతుండగా, రెండోవాడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మూడేళ్ల కిందట మూలవ్యాధి సోకడంతో బంగారుబాబు నాటువైద్యులను ఆశ్రయించాడు. క్వారీలారీలో క్లీనర్‌గా విధులు నిర్వర్తించే బంగారుబాబుకు మూలవ్యాధి నయంకాకపోగా కండరాలు పట్టేశాయి. దీంతో ఇంటికే పరిమితమైపోయాడు. రెండోకుమారుడు నాగరాజు అంతుచిక్కని వ్యాధితో పుట్టడంతో నగరంలోని ఆసుపత్రులన్నీ చుట్టేశారు. ఉన్నకాడికి అమ్మివైద్యం చేయించినా వ్యాధి నిర్ధారణ కాలేదు. కేన్సరో, టాన్సిల్సో అర్ధం కావట్లేదు. క్షయ కూడా ఉందంటూ వైద్యులు ఆ పరీక్షలు కూడా చేసి మందులు ఇస్తున్నారు. గోరుచుట్టుపై రోకటిపోటులా.. పెద్ద కుమారుడు అప్పలరాజు మజ్జివలస జెడ్పీహైస్కూల్లోనే పదోతరగతి పూర్తిచేసి ఈ ఏడాది ఇంటర్మీడియట్లో చేరాడు. ఈ నెల మొదటి వారంలో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో అస్వస్థతకు గురయ్యాడు. వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే కిడ్నీలు పాడయ్యాయన్నారు. రెండువారాల పాటు కేజీహెచ్‌లో ఉంచి డయాలసిస్ చేయించి మందులిచ్చి ఇటీవల డిశ్చార్జ్ చేశారు. గ్రామస్తులు, స్నేహితులు రూ.12వేలు పోగేసి సాయం చేశారు. ప్రస్తుతం డబ్బులేదు. -
మోడీ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమిలేదు
పాతపథకాలకు ప్రారంభోత్సవాలా? టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీణవంక : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యూపీఏ హయాంలో చేపట్టిన పథకాలకే శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారని ధ్వజమెత్తారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంచినీటి పథకాలకు కొత్తగా మిషన్ భగరీథ పేరుతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో 1200ల మెగావాట్ల సింగరేణి విద్యుత్ కేంద్రం పనులు యూపీఏ హయాంలోనే 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఆ ప్లాంట్‌ను మోదీ ఇప్పుడు జాతీకి అంకితం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మంజూరు చేసిన సంగతి మర్చిపోయారని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వంలోనే మనోహరబాద్–కొత్తపల్లి రైల్వే లైన్‌కు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ పాత పథకాలను కొత్తవి అంటూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. మోడీ పర్యటన అంటూ కోట్లు ఖర్చుచేశారే తప్ప.. తెలంగాణకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. మెదక్ జిల్లా రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్న సంఘటనపై ప్రధాని స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఉద్యోగుల విభజనపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్న విషయం గుర్తించుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని స్పష్టం చేశారు. టీపీసీసీ చైర్మన్ వెంట మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, మాజీ ఎమ్మెల్యేలు ఆరపెల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
హెల్ప్‌లెస్
బొబ్బిలి/విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: ప్రజలకు అందుబాటులో పోలీసుల సేవలు ఉంచి.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్కులు సేవలకు దూరంగా ఉన్నాయి.. జిల్లాలో తగినంత మంది పోలీసులు లేకపోవడం, ఉన్నవారిని సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో, ఇతరత్రా బందోబస్తులకు పంపిస్తుండడం వల్ల నిరంతరం ఉండాల్సిన హెల్ప్ డెస్కులు..తలుపులు తీయడానికి కూడా నోచుకోవడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్షలాది రూపాయలు వెచ్చించి జిల్లాలోని నాలుగు పురపాలక సంఘ కేంద్రా ల్లో పోలీస్ హెల్ప్ డెస్కులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దీనిని ప్రారంభించారు. అప్పటి ఎస్పీ కార్తికేయ సమయంలోనే బొబ్బిలిలో కాంప్లెక్సు సమీపంలో నిర్మించి ప్రారంబించేశాం అనిపిం చారు. అయితే దానికి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సిబ్బందిని మాత్రం నియమించలేదు. జిల్లా కేంద్రం తరువాత బొబ్బిలి పట్టణం, మండలంలో ఉన్నత విద్యాసంస్థలు దాదాపు 50 వర కూ ఉండడంతో విశాఖ జిల్లా నుంచి ప్రతి రోజూ వందలాది మంది విద్యార్థులు వచ్చి పోతుంటారు. అలాగే నాలుగు నియోజకవర్గాల ప్రజలు ైరె ల్వే ప్రయాణానికి బొబ్బిలిపై ఆధారపడతారు. ఇవి కాక పరిశ్రమలు అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచికూడా అధిక సంఖ్యలో ఇక్కడకు ఉద్యోగులు, కార్మికులు వస్తుంటారు. వీరంతా ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ని ఎదుర్కొంటున్నా పోలీసుల సహాయం మాత్రం స్టేషనుకు వెళ్తే గాని అందని పరిస్థితి ఉంది. అలాగే జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధి ఫూల్‌బాగ్ కాలనీ వద్ద సుమారు ఆరు నెలల క్రితం పోలీసు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ హెల్ప్‌డెస్క్‌లో రాత్రి పూట సిబ్బందిని సక్రమంగా నియమించకపోవడంతో సాదాసీదాగానే నడుస్తోంది. విజయనగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలో హెల్ప్‌డెస్క్ నిర్మా ణం పూర్తయింది. ఈ డెస్క్‌కు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. విజయనగరంలో.. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు హెల్ప్‌డెస్క్‌లో మూడు షిప్టులుగా విధులను నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడుగంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఒంటిగంట నుంచి రాత్రి 9గంటల వరకు, రాత్రి 9గంటలనుంచి ఉదయం 7గంటల వరకు పోలీసు సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. విజయనగరం పట్టణంలో మిగిలిన రెండు పోలీసు హెల్ప్‌డెస్క్‌లను సక్రమంగా నిర్వహించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
నేను నిస్సహాయుడిని: కేంద్ర మంత్రి కావూరి
ఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో తాను నిస్సహాయుడినని, ఎవరైనా ఏమైనా అనుకోండని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. సీమాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కావూరి స్పందన తీరు ఈ విధంగా ఉంది. తెలంగాణ ప్రకటన తర్వాత తాను మాట్లాడ లేదన్న అపవాదు ఉంటే ఉండనీయండి అని అన్నారు. తనకు స్పష్టత ఉందని, తనకు విశ్వసనీయత ఉందని కావూరి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు యుపిఏ భాగస్వామ్య పక్షాలు, సిడబ్ల్యూసి ఆమోదం తెలిపిన తరువాత కావూరి ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిపోయారని సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఏలూరులోని ఆయన నివాసంపై దాడి కూడా చేశారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తరువాత కావూరి సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో చల్లబడిపోయినట్లు విమర్శ ఉంది.