హెల్ప్‌లెస్
Published Mon, Dec 23 2013 2:49 AM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM
బొబ్బిలి/విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: ప్రజలకు అందుబాటులో పోలీసుల సేవలు ఉంచి.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్కులు సేవలకు దూరంగా ఉన్నాయి.. జిల్లాలో తగినంత మంది పోలీసులు లేకపోవడం, ఉన్నవారిని సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో, ఇతరత్రా బందోబస్తులకు పంపిస్తుండడం వల్ల నిరంతరం ఉండాల్సిన హెల్ప్ డెస్కులు..తలుపులు తీయడానికి కూడా నోచుకోవడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్షలాది రూపాయలు వెచ్చించి జిల్లాలోని నాలుగు పురపాలక సంఘ కేంద్రా ల్లో పోలీస్ హెల్ప్ డెస్కులను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
జిల్లా కేంద్రంలో ముందుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద దీనిని ప్రారంభించారు. అప్పటి ఎస్పీ కార్తికేయ సమయంలోనే బొబ్బిలిలో కాంప్లెక్సు సమీపంలో నిర్మించి ప్రారంబించేశాం అనిపిం చారు. అయితే దానికి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సిబ్బందిని మాత్రం నియమించలేదు. జిల్లా కేంద్రం తరువాత బొబ్బిలి పట్టణం, మండలంలో ఉన్నత విద్యాసంస్థలు దాదాపు 50 వర కూ ఉండడంతో విశాఖ జిల్లా నుంచి ప్రతి రోజూ వందలాది మంది విద్యార్థులు వచ్చి పోతుంటారు. అలాగే నాలుగు నియోజకవర్గాల ప్రజలు ైరె ల్వే ప్రయాణానికి బొబ్బిలిపై ఆధారపడతారు.
ఇవి కాక పరిశ్రమలు అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచికూడా అధిక సంఖ్యలో ఇక్కడకు ఉద్యోగులు, కార్మికులు వస్తుంటారు. వీరంతా ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ని ఎదుర్కొంటున్నా పోలీసుల సహాయం మాత్రం స్టేషనుకు వెళ్తే గాని అందని పరిస్థితి ఉంది. అలాగే జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధి ఫూల్‌బాగ్ కాలనీ వద్ద సుమారు ఆరు నెలల క్రితం పోలీసు హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ హెల్ప్‌డెస్క్‌లో రాత్రి పూట సిబ్బందిని సక్రమంగా నియమించకపోవడంతో సాదాసీదాగానే నడుస్తోంది. విజయనగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలో హెల్ప్‌డెస్క్ నిర్మా ణం పూర్తయింది. ఈ డెస్క్‌కు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు.
విజయనగరంలో..
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు హెల్ప్‌డెస్క్‌లో మూడు షిప్టులుగా విధులను నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడుగంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఒంటిగంట నుంచి రాత్రి 9గంటల వరకు, రాత్రి 9గంటలనుంచి ఉదయం 7గంటల వరకు పోలీసు సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. విజయనగరం పట్టణంలో మిగిలిన రెండు పోలీసు హెల్ప్‌డెస్క్‌లను సక్రమంగా నిర్వహించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Advertisement