సీమాంధ్రలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలకు పాలకపక్షం కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని ఆ ప్రాంత టీడీపీ ఎంపీలు విమర్శించారు.
ఢిల్లీ: సీమాంధ్రలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలకు పాలకపక్షం కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని ఆ ప్రాంత టీడీపీ ఎంపీలు విమర్శించారు. సరైన సంప్రదింపులు జరపకుండా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ఎలా ప్రకటిస్తారని వారు మండిపడ్డారు. హడావిడిగా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయ లబ్ది కోసమేనని ఎంపీలు పేర్కొన్నారు.
ఆంటోని కమిటీతో తెలుగు ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని సృష్టం చేశారు. రాజధాని, నదీ జలాలు, ఉద్యోగుల భద్రతకు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.