ఎటు వెళ్లాలో..? | how to way of candidates ? | Sakshi
Sakshi News home page

ఎటు వెళ్లాలో..?

Published Tue, Feb 18 2014 1:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఎటు వెళ్లాలో..? - Sakshi

ఎటు వెళ్లాలో..?

ఎటు వెళ్లాలో..?
 సాక్షి ప్రతినిధి, కర్నూలు
 ఢిల్లీ పరిణామాలు అధికార కాంగ్రెస్‌కు.. ప్రతిపక్ష టీడీపీకి కంటిమీద కునుకులేకుండా చే స్తున్నాయి. రాష్ట్రవిభజన ప్రక్రియ చివరి అంకానికి చేరడంతో ఈ రెండు పార్టీ నేతల పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది.
  ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేస్తున్నారనే ప్రచారం వస్తోంది. అలాగే కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం పార్టీలోకి వెళ్లాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని భావించిన కొందరు అధికారపార్టీ నేతలకు అక్కడ తలుపులు మూసివేశారు.
  దీంతో చేసేది లేక ఆ కొందరికి కిరణ్‌పార్టీ ఫ్లాట్‌ఫాం ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. జయాపజయాల మాటెలా ఉన్నా.. తామూ ఓ పార్టీ తరఫున పోటీ చేస్తున్నామనే చెప్పుకునేందుకు ఉపయోగపడనుందనే భావంతో ఆ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.
 మునిగే వారెవరు?: మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నీరజారెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులు కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే పార్టీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది. వీరంతా హైదరాబాద్‌లో సీఎం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం. అయితే ఇందులో మంత్రి టీజీ వెంకటేష్ రెండు వైపులా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు  ప్రచారం జరుగుతోంది.
  ఓపక్క టీడీపీతో మంతనాలు నెరుపుతూనే.. కిరణ్ వర్గంతో సన్నిహితంగా ఉంటున్నారు. అందులో భాగంగానే సోమవారం ఢిల్లీలో ఏపీఎన్‌జీఓలు చేపట్టిన ధర్నాలో మంత్రి టీజీ హాజరై తానూ సమైక్యవాదినేనని రుజువుచేసే ప్రయత్నం చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే టీడీపీ నుంచి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తానేనని మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కిరణ్ పార్టీలోనే మంత్రి టీజీ చేరుతారనే ప్రచారం కూడా ఉంది. ఇక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విషయానికి వస్తే కిరణ్‌పార్టీయా? టీడీపీనా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు.  
 సమైక్య ముసుగు... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే పార్టీ సమైక్యాంధ్ర పార్టీగా ఇప్పటికే ప్రచారంలో ఉంది. అందులో భాగంగానే కొద్దిరోజుల క్రితమే జిల్లాలో సమైక్యాంధ్ర ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రచారానికి తెరతీసిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర ముసుగులోనే కిరణ్ పార్టీ జనంలోకి రావటానికి సిద్ధమవుతోంది. సమైక్యాంధ్ర కోసం 66 రోజుల పాటు జనం గొంతు చించుకుని నినదించినా ఈ పార్టీ నేతలు ఒక్కరూ మద్దతు తెలిపిన పాపాన పోలేదు. ఆందోళనకారులపై అక్రమ కేసులుపెట్టి అరెస్టు చేయించిన విషయాన్ని సమైక్యవాదులు  గుర్తుచేస్తున్నారు. ఉద్యమంలో భాగంగా అరెస్టైన వారిని విడిపించే కృషి కూడా చేయలేదని చెబుతున్నారు. అవేమీ చేయని వారికి ఇప్పుడు సమైక్యాంధ్ర గుర్తొంచ్చిందా? అని విమర్శిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ పార్టీ నిర్వరామ కృషి చేస్తుందో తమకు తెలుసని జనం స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement