‘కాంగ్రెస్, టీడీపీలే సీమాంధ్ర ద్రోహులు’ | Congress, the tdp Seemandhra scoundrels | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్, టీడీపీలే సీమాంధ్ర ద్రోహులు’

Published Fri, Mar 28 2014 3:52 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress, the tdp Seemandhra scoundrels

 రైల్వేకోడూరురూరల్, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీలే సీమాంధ్ర ద్రోహులని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రైల్వేకోడూరులోని రంగ నాయకుల పేటలో గురువారం కోడూరు-6 ఎంపీటీసీకి వైఎస్‌ఆర్‌సీపీ తరపున పోటీ చేస్తున్న వెంకటగిరి సుభాషిణి చేస్తున్న ప్రచారంలో ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పంజం సుకుమార్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తెలుగు ప్రజలను రెండుగా చీల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.  రాబోయే ఎన్నికలలో ఆ రెండు పార్టీలను ప్రజలు మట్టి కరిపిస్తారన్నారు. అనంతరం కొల్లం బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ క్షత్రియ నాయకులు సిద్దేశ్వరరాజు, కోడూరు నియోజకవర్గ మైనార్టీ ఇన్‌చార్జ్ ఎస్‌ఏ సలాం, సేవాదళ్ మండలాధ్యక్షుడు వై.రత్నయ్య, అమర్‌నాథ్, సుభాన్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement