ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ | AP CM Chandrababu Third Day Delhi Tour Live Updates | Sakshi
Sakshi News home page

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ

Published Fri, Jul 5 2024 10:57 AM | Last Updated on Fri, Jul 5 2024 12:28 PM

AP CM Chandrababu Third Day Delhi Tour Live Updates

సాక్షి, ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూడో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం.

ఇక, మూడో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు.. నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు. అలాగే, జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. ఉదయం 11:30 గంటలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం, చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement