
తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదు: దిగ్విజయ్‌సింగ్
తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ శనివారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రక్రియ ఆగిపోలేదని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ శనివారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. సీమాంధ్రుల సమస్యల అధ్యాయనంపై ఏర్పాటు అయిన ఆంటోని కమిటీ తన పని మంగళవారం నుంచి ప్రారంభిస్తుందని చెప్పారు. ఆంటోనీ కమిటీ అందరి అభ్యంతరాలకు పరిష్కారం చూపుతుందని ఆయన ఆకాంక్షించారు. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టబడి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలకు దిగ్విజయ్ సింగ్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ విధేయుడని దిగ్విజయ్ ఈ సందర్భంగా అభివర్ణించారు. రాష్ట్ర విభజనపై ఇరుప్రాంతాలకు చెందాల్సిన పలు అంశాలపై సిఎం కిరణ్ గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో విఫులంగా చర్చించారు. దీనిపై తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా వివిధ పార్టీల నేతలు పెద్ద దుమారం సృష్టించారు. ఈ నేపథ్యంలో కిరణ్తో సంప్రదిస్తానని దిగ్విజయ్ సింగ్ ఈ సందర్భంగా వెల్లడించారు.