రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు కృషి : కాసు | I will try to united andhrapradesh state: Minister kasu venkata krishna reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు కృషి : కాసు

Published Fri, Aug 9 2013 10:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM

రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు కృషి : కాసు

రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు కృషి : కాసు

తాను సమైక్యవాదం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్ను గౌరవిస్తానని రాష్ట్ర మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో వెల్లడించారు. తమ కుటుంబం సమైక్యవాదాన్ని బలపరిచిన కుటుంబమని ఆయన పేర్కొన్నారు.

సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ఆంటోని కమిటీ ముందు వినిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని కాసు కృష్ణారెడ్డి ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు.

సమైక్యవాదానికి మద్దతుగా ఇటీవలే కాసు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్ లు గతంలోనే రాజీనామా చేయగా, మంత్రి తోట నర్సింహం నిన్న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement