విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర సమీప ప్రాంతాల్లో కూడా ఈ ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.
అయితే దక్షిణ తమిళనాడు - కొమరిన్ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. ఈ ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.