కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఆంటోనీ కమిటీని కలిశారు. వారు తమ వాదనలు కమిటీకి వినిపించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ 2014 ఎన్నికల నాటికి పూర్తి చేయాలని కోరారు. లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వారు చెప్పారు. సిబ్ల్యూసి తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు. హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి. అందుకు తమకు ఎటుంటి అభ్యంతరంలేదని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా చూడాలని కోరారు. తెలంగాణలో అత్యధిక సీట్లు కాంగ్రెసే గెలుస్తుందని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక పిసిసి ఏర్పాటు చేయాలని కోరారు. అంతకు ముందు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు సమావేశమయ్యారు. ఆంటోనీ కమిటీకి వివరించాల్సిన అంశాలపై చర్చించారు.
Published Wed, Aug 14 2013 10:42 PM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement