రాజీనామాలా....సోనియాకు లేఖనా? | Seemandhra Ministers mulling over exit strategy | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 3 2013 10:31 AM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM

సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్రమంత్రలు, ఎంపీలు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం వారు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంటోనీ కమిటీ ముందు వాదించాల్సిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలా.... లేక సోనియాగాంధీకి లేఖ రాయాలా అనే అంశాలపై మంతనాలు జరుపుతున్నారు. అయితే రాజీనామాలపై పలువురు కేంద్ర మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజీనామాలు చేస్తే పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉండదంటూ కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజనపై ముందుకే వెళతామని కేంద్రం స్పష్టం చేయడంతో.. ఆంటోనీ కమిటీతో ఇవాళ జరగబోయే సీమాంధ్ర ఎంపీల భేటీ ఆసక్తికరంగా మారింది.ఆంటోనీ కమిటీ ముందు సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపించడానికి సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరిన ఎంపీలంతా.. కమిటీ ముందు ఉంచాల్సిన డిమాండ్లపై ముమ్మర కసరత్తు చేశారు. రోజురోజుకూ ఉధృతమవుతున్న సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీవ్ర మైంది. విభజనకు కాంగ్రెస్ కారణమైనందున ఆ ప్రాంత ప్రజలంతా తమను దోషులుగా పరిగణిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. నిన్నటివరకు రాజీనామాలు చేసి రావాలని చెబుతున్న సమైక్యవాదులు తాజాగా రాజీనామాలను ఆమోదించుకున్న తరువాతే నియోజకవర్గంలో కాలుపెట్టాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement