seemandhra leaders Resignations
-
కార్యాచరణ కోసం త్వరలో నేతలు భేటీ
-
'రాజీనామాలు వద్దని సీఎం....కావాలని ప్రజలు'
న్యూఢిల్లీ : సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి అంటున్నారని.... అయితే రాజీనామాలు చేయాలని ప్రజలంటున్నారని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అవసరం అయినప్పుడు రాజీనామాలు చేస్తామన్నారు. పార్టీలు సిద్ధాంతాలు వదిలేయటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కావూరి అన్నారు. కాగా ఈ రోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజీనామాల ఆమోదంపై స్పీకర్‌పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. భేటీకి కేవీపీ రామచంద్రారవు, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. -
రాజీనామాలా....సోనియాకు లేఖనా?
-
రాజీనామాలా....సోనియాకు లేఖనా?
న్యూఢిల్లీ : సీమాంధ్ర కాంగ్రెస్ కేంద్రమంత్రలు, ఎంపీలు మంగళవారం ఉదయం కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం వారు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంటోనీ కమిటీ ముందు వాదించాల్సిన అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలా.... లేక సోనియాగాంధీకి లేఖ రాయాలా అనే అంశాలపై మంతనాలు జరుపుతున్నారు. అయితే రాజీనామాలపై పలువురు కేంద్ర మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజీనామాలు చేస్తే పార్లమెంట్లో చర్చించే అవకాశం ఉండదంటూ కొందరు మంత్రులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజనపై ముందుకే వెళతామని కేంద్రం స్పష్టం చేయడంతో.. ఆంటోనీ కమిటీతో ఇవాళ జరగబోయే సీమాంధ్ర ఎంపీల భేటీ ఆసక్తికరంగా మారింది.ఆంటోనీ కమిటీ ముందు సమైక్య నినాదాన్ని గట్టిగా వినిపించడానికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ చేరిన ఎంపీలంతా.. కమిటీ ముందు ఉంచాల్సిన డిమాండ్లపై ముమ్మర కసరత్తు చేశారు. రోజురోజుకూ ఉధృతమవుతున్న సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమ నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీవ్ర మైంది. విభజనకు కాంగ్రెస్ కారణమైనందున ఆ ప్రాంత ప్రజలంతా తమను దోషులుగా పరిగణిస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. నిన్నటివరకు రాజీనామాలు చేసి రావాలని చెబుతున్న సమైక్యవాదులు తాజాగా రాజీనామాలను ఆమోదించుకున్న తరువాతే నియోజకవర్గంలో కాలుపెట్టాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు.