
'రాజీనామాలు వద్దని సీఎం....కావాలని ప్రజలు'
న్యూఢిల్లీ : సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి అంటున్నారని.... అయితే రాజీనామాలు చేయాలని ప్రజలంటున్నారని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అవసరం అయినప్పుడు రాజీనామాలు చేస్తామన్నారు.
పార్టీలు సిద్ధాంతాలు వదిలేయటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కావూరి అన్నారు. కాగా ఈ రోజు ఉదయం ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజీనామాల ఆమోదంపై స్పీకర్పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. భేటీకి కేవీపీ రామచంద్రారవు, ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు.