ఉద్యమాలపై ఆరా తీసిన సోనియాగాంధీ | D.Srinivas meets sonia gandhi | Sakshi
Sakshi News home page

ఉద్యమాలపై ఆరా తీసిన సోనియాగాంధీ

Published Fri, Sep 13 2013 11:19 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఉద్యమాలపై ఆరా తీసిన సోనియాగాంధీ - Sakshi

ఉద్యమాలపై ఆరా తీసిన సోనియాగాంధీ

న్యూఢిల్లీ : పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గురువారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ సాయంత్రం భేటీ కానున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనపై ఆంటోనీ కమిటీ నేడు తన నివేదినను కాంగ్రెస్ కోర్ కమిటీకి సమర్పించనుంది. ఆంటోనీ కమిటీ నివేదికపై కోర్ కమిటీలో చర్చ జరగనున్న నేపథ్యంలో డీఎస్.... పార్టీ అధినేత్రిని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది.

 వీరిద్దరి మధ్య భేటీ సుమారు 45 నిమిషాల పాటు సాగింది. తెలంగాణతో పాటు సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలపై సోనియా ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్రంలోని పరిస్థితులపై సోనియాకు ఈ సందర్భంగా డీఎస్ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, ఆంటోనీ కమిటీ నివేదికపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement