ఢిల్లీ: ఏ రోజైతే తమ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఆ రోజు నుంచి తాము తమ పదవుల్లో ఉండం అని కేంద్ర మంత్రి పల్లంరాజు చెప్పారు. ఆంటోనీ కమిటీని హైదరాబాద్‌లో పర్యటించాలని కోరినట్లు తెలిపారు. మూడు ప్రాంతాల వారికి నష్టం జరగకూడదని చెప్పామన్నారు. తాము పదవుల్లో ఉన్నందున తమపై వ్యతిరేకత వస్తుందన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమకారులు సీమాంధ్ర మంత్రులను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.