న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం తన కసరత్తులను మరింత వేగవంతం చేసింది. డిసెంబర్ 9 వ తేదీ నాటికి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే జీవోఎం(కేంద్ర మంత్రుల) బృందాన్నిఏర్పాటు చేసి శాంతిభద్రతలు, నీటి పారుదల వనరులు, భౌగోళిక అంశాలపై దృష్టి సారించిన కేంద్ర కేబినెట్ తెలంగాణ అంశాన్నిత్వరతగతిన పూర్తి చేయాలని యోచిస్తోంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గత మూడు రోజుల క్రితం ఢిల్లీలో జీవోఎం సభ్యులకు అందుబాటులో ఉన్నారు. మూడు రోజుల్లో మూడుసార్లు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయిన నరసింహన్ రాష్ట్రంలోని కీలక అంశాలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖలో కార్యదర్శులు శుక్రవారం మరోమారు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర విభజన అంశాలను ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.