సీఎం రాజీనామా వార్తలు రూమర్లే: పనబాక లక్ష్మి
సీఎం రాజీనామా వార్తలు రూమర్లే: పనబాక లక్ష్మి
Published Wed, Jan 15 2014 6:40 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీడుతున్నారంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఖండించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీఎం కొత్త పార్టీని పెడుతున్నారనే వార్తల్లో వాస్తవం లేదని ఆమె తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పనబాక లక్ష్మి అన్నారు.
సీఎం కిరణ్ తండ్రి, తాతలు కాంగ్రెస్ పార్టీకి నిబద్దులైన నేతలని ఆమె వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలోని బాపట్లలో మీడియాతో ముచ్చటిస్తూ.. జనవరి 23 తర్వాత రాజీనామా సమర్పిస్తారని వస్తున్న వార్తలు రూమర్లు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షంచుకోవాలని సీఎం కేంద్రానికి విజ్క్షప్తి చేసిన సంగతి తెలిసిందే. సమైక్య రాష్ట్రం కోసం తాను పార్టీ నుంచి వైదొలగేందుకు సిద్దమే అని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement