పనబాక దర్శన భాగ్యం కష్టమే! | apngo leaders could not meet panabaka lakshmi | Sakshi
Sakshi News home page

పనబాక దర్శన భాగ్యం కష్టమే!

Published Wed, Feb 12 2014 6:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

పనబాక దర్శన భాగ్యం కష్టమే!

పనబాక దర్శన భాగ్యం కష్టమే!

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు దేశ రాజధాని నగరంలో ఉద్యమిస్తున్న ఏపీ ఎన్జీవో నాయకులకు కేంద్ర మంత్రి, బాపట్ల ఎంపీ పనబాక లక్ష్మి దర్శన భాగ్యం దొరకలేదు. ఎంత ప్రయత్నించినా కేంద్ర మంత్రిని కలవడం మాత్రం వారికి సాధ్యం కాలేదు. తమకు మద్దతు చెబుతారేమోనన్న ఆశతో ఏపీఎన్జీవో నాయకులు కొందరు ఢిల్లీలోని పనబాక లక్ష్మి నివాసానికి బుధవారం నాడు వెళ్లారు.

కానీ, కలిసేందుకు మంత్రిగారి నుంచి ముందస్తు అనుమతి మీకు లేదంటూ పోలీసులు వారిని బలవంతంగా బయటకు పంపేశారు. ఒక్కసారి కలిసి మాట్లాడి వెళ్లిపోతామని చెప్పినా ఏమాత్రం వినిపించుకోలేదు. దాంతో ఏమీ చేయలేని ఏపీఎన్జీవో నాయకులు సమైక్య నినాదాలు చేసుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement