గుడివాడ/బాపట్ల, న్యూస్‌లైన్: తడ నుంచి ఇచ్ఛాపురం వరకు ఎనిమిది లైన్ల రోడ్డు వేసేందుకు కేంద్రప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. ఆ రోడ్డు పూర్తయితే సీమాంధ్ర మరో ఇండోనేసియాగా మారుతుందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ, గుంటూరు జిల్లా బాపట్లల్లో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడాలని కోరారు. సీమాంధ్రలో పలు సంస్థలు స్థాపించాలని జీవోఎంను కోరినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచే కాంగ్రెస్ తరఫున పోటీచేస్తానని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మంత్రి స్పష్టం చేశారు.