
'అద్భుతం జరిగితే తప్ప తెలంగాణ బిల్లు ఆగదు'
గుంటూరు: పార్లమెంట్‌లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, తెలంగాణ బిల్లు ఆగదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. ఉదయం ఒంగోలులో మాట్లాడుతూ సొంత పార్టీ ఎంపిలపై ధ్వజమెత్తిన మంత్రి సాయంత్రం గుంటూరులో కేంద్ర మంత్రులపై ధ్వజమెత్తారు. కేంద్రమంత్రులు ఎవరిదారిలో వారు వెళ్లినందునే తమని అధిష్టానం పట్టించుకోవడంలేదన్నారు. వేరే పార్టీలోకి వెళ్లేందుకు తమ వాళ్లు చాలామంది గోడమీద పిల్లిలా కూర్చుని ఉన్నారని విమర్శించారు.
ఇదిలా ఉండగా, ఉదయం పనబాక లక్ష్మి ఒంగోలులో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి రాజీనామాలు చేసేవారే అసలు దొంగలని విమర్శించారు. స్వలాభం కోసం పార్టీలో కొనసాగుతున్న నేతలు బయటకు వెళితేనే పార్టీ బాగుపడుతుందన్నారు.