విభజనకు అనుకూలంగా ఓటేస్తా: పనబాక
గుంటూరు: వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పునరుద్ఘాటించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేస్తే విభజనకు అనుకూలంగా ఓటేస్తానని ఆమె వెల్లడించారు. భద్రాచలాన్ని సీమాంధ్రకే చెందేలా రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల కమిటీకి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని పనబాక విమర్శించారు.
విభజనకు సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధపడాలని ఆమె నిన్న కోరారు. సీమాంధ్రలో పలు సంస్థలు స్థాపించాలని జీవోఎంను కోరినట్లు తెలిపారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను యూటీ చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బాపట్ల నుంచే కాంగ్రెస్ తరఫున పోటీచేస్తానని, కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని మంత్రి స్పష్టం చేశారు.