బీజేపీలో చేరేది లేదు
తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. గురువారం గుంటూరు విచ్చేసిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తాను తుది శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు తనకు సహకరించడం లేదని పనబాక లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు.
అయితే కాంగ్రెస్ అధిష్టానం తనకు రాజ్యసభ సీటు కేటాయిస్తే కాదనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఓట్లు గల్లంతు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ బీజేపీలో చేరతారని ఊహగానాలు ఊపందుకున్నాయి. దాంతో గుంటూరు విచ్చేసిన పనబాకను ఆ అంశంపై ప్రశ్నించారు. దీంతో పనబాక లక్ష్మిపై విధంగా స్పందించారు.