Bapatla constituency
-
నోరెత్తారా..అంతు చూస్తాం..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల నియోజకవర్గం పచ్చపార్టీలో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీలోని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని బీసీ, ఎస్సీ నేతలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. బాపట్లలో ఇటీవల టీడీపీలోని యాదవ నేతలపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మతోపాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన ఐటీడీపీ నేత దాడులకు తెగబడ్డారు. ఏకంగా పార్టీ కార్యాలయంలో దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటనను బీసీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నరేంద్రవర్మ కమ్మ నేతలకు వంత పాడటంతో బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి ఆజ్యం ఇక్కడే.. ఇటీవల తమకు రావాల్సిన డేకరేషన్కు సంబంధించి యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు మద్దిబోయిన రాంబాబు డబ్బులు అడిగాడు. దీంతో కోపోద్రేకులైన నరేంద్రవర్మతోపాటు ఆయన తనయుడు రాకేష్వర్మలు కలిసి పార్టీ కార్యాలయంలో రాంబాబుపై దాడికి పాల్పడ్డారు. దీనిపై నరేంద్రవర్మ ఆయన తనయుడిపై పోలీసు కేసు నమోదైంది. తాజాగా శనివారం కమ్మ సామాజికవర్గానికి చెందిన ఐ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు యాదవ సామాజికవర్గానికి చెందిన పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన టీడీపీ సమావేశంలోనే జరిగింది. ఐటీడీపీ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించకపోవడంతోపాటు టీడీపీ అభివృద్ధి కోసం పనిచేయడం లేదని గొలపలి శ్రీనివాసరావు ప్రశ్నించడంతో దాన్ని జీర్ణించుకోలేని మానం శ్రీనివాసరావు ఆగ్రహించి దాడికి తెగబడ్డాడు. దీంతో నేతలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడిపైనే కమ్మ సామాజికవర్గం నేత దాడికి దిగడాన్ని ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేక పోతోంది. రగిలిపోతున్న బీసీలు అటు వర్మ సామాజిక వర్గం... ఇటు కమ్మ సామాజికవర్గం నేతలు సొంతపార్టీ యాదవులపై వరుస దాడులకు దిగడంతో వారు రగిలిపోతున్నారు. ఈ వ్యవహారంపై నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అధ్యక్షుడిపై దాడి జరిగిన మరుక్షణమే యాదవ నేతలతోపాటు, బీసీ కులాల నేతలు సమావేశమై కమ్మ నేతల దాడిని ఖండించారు. ఓట్ల పరంగానూ బాపట్ల నియోజకవర్గంలో 20 వేలకు పైగా యాదవ సామాజికవర్గం ఓట్లు ఉండగా చాలా గ్రామాల్లో వారి ఆధిపత్యం ఉంది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న వర్మ క్షత్రియ సామాజిక వర్గానికి 3వేల ఓట్లు, కమ్మ సామాజికవర్గం ఓట్లు 9వేల లోపే ఉన్నాయి. అయినా తమనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని బీసీలు మండిపడుతున్నారు. గతంలో ఎస్సీలపైనా దాడులు గతంలో ఎస్సీ నేతలపైనా టీడీపీ నేతలు దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తానికొండ దయాబాబుపై కమ్మ సామాజికవర్గానికిచెందిన ఇనగంటి శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలోనే దాడిచేశారు. అయినా ఆ నేతకు వర్మ మద్దతు పలకడమే కాకుండా బాధితుడైన దయాబాబును పార్టీ పట్టణ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీంతో ఎస్సీ సామాజికవర్గం నేతలు కూడా నరేంద్రవర్మతీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎస్సీలు, బీసీలు వచ్చే ఎన్నికల వేదికగా వారిపై క్షక్ష తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. -
గోతికాడి గుంటనక్కలా పచ్చ విషాన్ని కక్కుతున్న ఈనాడు
-
రాజకీయాల్లో రాజర్షి!
సాక్షి, గుంటూరు: నిస్వార్థం ఎంత గొప్పదో నిరూపించాడు.. నిశీధి మాటున వెలుగులు పంచాడు.. దాహార్తిని తీర్చగా జలసిరులను పొంగించాడు.. బీడు భూముల్లో పసిడి కాంతుల కోసం జలయజ్ఞం సంకల్పించాడు.. పేదవాడి గోడువిని గూడు నిర్మించాడు.. అనారోగ్యానికి ఆరోగ్యశ్రీతో వైద్యం చేశాడు.. కార్పొరేట్ విద్యను పేదలకు దాసోహమనిపించాడు.. ముగింపు లేని కథలా.. భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా.. మనుష్యులందు మహర్షిలా.. రాజకీయాల్లో రాజర్షిలా.. కీర్తిగడించాడు. చెరగని జ్ఞాపకాలను పంచి.. ప్రవేశపెట్టిన పథకాలకు వందేళ్ల ఆయుష్షునిచ్చి.. జనహృదయాల్లో నిలిచాడు. నేడు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వైఎస్సార్ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. తొలి ఐదేళ్ల కాలంలో ఏకంగా 57 సార్లు జిల్లాలో పర్యటించారు. ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 2.26 లక్షల ఇళ్లు నిర్మించి గూడు లేని నిరుపేదకు ఆశ్రయం కల్పించారు. పులిచింతలతో డెల్టాను సస్యశామలం చేశారు. సాగర్ చివరి ఆయకట్టు వరకూ నీళ్లందించి పల్నాట ఫ్యాక్షన్ రక్కసిని రూపుమాపారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన ఘణత వైఎస్‌కే దక్కింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్ జిల్లాకు పెద్ద పీట వేశారు. నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి జిల్లాను మిని కేబినెట్‌గా మార్చారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. 12 మున్సిపాల్టీల్లో వైఎస్సార్ మార్క్.. పొన్నూరు పట్టణంలో మున్సిపాల్టీ నూతన భవన నిర్మాణానికి దివంగత మహానేత వైఎస్సార్ రూ.1 కోటి నిధులను మంజూరు చేశారు. రూ.1 కోటి వ్యయంతో హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేశారు. తెనాలి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి 2009లో మహానేత శంకుస్థాపన చేశారు. మంగళగిరి పట్టణంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ సీమాంధ్రలో ఎక్కడా లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వైఎస్సార్ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఆయన మరణానంతరం పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాజీవ్ గృహకల్ప ద్వారా వెయ్యి మంది నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించేందుకు వైఎస్సార్ ప్రణాళిక రూపొందించి తొలి విడతలో 504 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆయన అకాల మరణంతో రెండో విడత రాజీవ్ గృహకల్ప నిలిచిపోవడంతో 500 మంది నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. తాడేపల్లి పట్టణాన్ని కూడా మున్సిపాల్టీగా మార్చేందుకు వైఎస్సార్ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.40 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాల్టీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత హయాంలో అప్పటి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు గోవిందాపురం వద్ద కృష్ణానది నుంచి పిడుగురాళ్లకు రూ. 36 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి మాచర్ల పట్టణానికి మంచినీటినందించే పథకానికి రూ.16 కోట్లతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే వైఎస్సార్ అకాల మరణంతో ఆ పథకం అంశం మురుగున పడింది. వైఎస్సార్ నగరబాట కార్యక్రమంలో మాచర్ల పట్టణానికి వచ్చి అడగకుండానే సిమెంట్‌రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశారు. సత్తెనపల్లి పట్టణంలో వైఎస్సార్ హయాంలో రూ.14.5 కోట్ల వ్యయంతో 120 ఎకరాలను కొనుగోలు చేసి మంచినీటి చెరువును తవ్వించారు. అంతేకాకుండా రూ. 20 కోట్ల నిధులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఓవర్‌హె డ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశారు. 60 కి.మీ మేర పైప్‌లైన్ నిర్మాణం పట్టారు. మురికివాడల అభివృద్ధి కోసం రూ. 15.38 కోట్ల నిధులను అందించారు. చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్ హయా ంలో మురికివాడల అభివృద్ధి కోసం రూ. 16.74 కోట్ల నిధులను మంజూరు చేశారు. 2005లో మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు, నిరుపేదలకు నివాస గృహాలు నిర్మించుకునేందుకు, ఇల్ల పట్టాలు ఇచ్చేందుకు రూ.8 కోట్లతో 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశారు. నరసరావుపేట మున్సిపాల్టీలో మురుగు రోడ్లపైకి చేరకుండా శాశ్వత పరిష్కారం కోసం 2008లో మహానేత రూ.44 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పథకానికి శంకుస్థాపన చేశారు. అంతే కాకుండా రూ.22 కోట్లతో చిలకలూరిపేట రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, నిరుపేదలకు సొంతింటి కళ సాకరం అయ్యేందుకు రాజీవ్ గృహకల్ప వంటి కార్యక్రమాలు చేపట్టారు. బాపట్ల పట్టణంలో వైఎస్సార్ హయాంలో మురుగునీరు సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ. 49 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా రూ. 2 కోట్ల వ్యయంతో నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప పేరుతో గృహ సముదాయాలు నిర్మించారు. దివంగత మహానేత వైఎస్సార్ వినుకొండ పట్టణాన్ని 2005లో మున్సిపాల్టీగా మార్చి రూ.30 కోట్లతో పట్టణంలో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణ ప్రజల దామార్తిని తీర్చేందుకు రూ.15 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. రేపల్లె పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.13 కోట్ల వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నిర్మించారు. చివరి సంతకం కూడా రైతుల కోసమే 2009లో రెండో సారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్.. మరణానికి ముందు రోజు మిర్చి రైతులకు బీమా పరిహారం ఫైల్ పైనే సంతకం చేశారు. 2009 సెప్టెంబరు 1న వాతావరణ ఆధారిత బీమా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. వైఎస్ హెలికాఫ్టర్ ఎక్కే ముందు వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డికి ఈ విషయాన్ని గుర్తు చేయడంతో ఆ సమయంలో ప్రభాకరరెడ్డి గుంటూరు జిల్లా వ్యవసాయాధికారులతో వాతావరణ ఆధారిత భీమాతో రైతులకు రూ.22 కోట్లు పరిహారం అందించాలని సూచించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించేందుకు ముఖ్యమంత్రిగా ఆయన సంతకం చేశారు. 15వేల మంది రైతులకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఎకరాకు పరిహారం అందింది. ఆరోగ్య శ్రీ ఇక్కడి నుంచే నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించారు. రాజీవ్ పల్లెబాట, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిర ప్రభ వంటి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఇక్కడే జరిగాయి. దేశంలో రెండో స్పైసెస్ పార్క్ భారతదేశంలోనే రెండో స్పైసెస్ (సుగంధ ద్రవ్యాల)పార్క్‌ను యడ్లపాడు మండలంలో ఏర్పాటు చేసిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కుతుంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా కేంద్రం మూడు స్పైసెస్ పార్క్‌లను మంజూరు చేసింది. అందులో ఒక స్పైసెస్ పార్క్‌ను యడ్లపాడు మండలంలో ఏర్పాటు చేయడానికి వైఎస్ విశేష కృషి చేశారు. సుమారు రూ.1.5 కోట్లతో 124.79 ఎకరాల్లో ఈ పార్క్‌ను నిర్మించారు. కొండవీడు కోట అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. సుమారు రూ.100కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. అందులో భాగంగా 2007లో జులైలో రూ.5కోట్లతో కొండవీడుకోట పైకి ఘాట్‌రోడ్డు ఏర్పాటు కోసం నిధులను మంజూరు చేశారు. -
ఢిల్లీ గడ్డపై బాపట్ల వాణి వినిపిస్తా
సాక్షి, బాపట్ల : ‘బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను నిలబడాలని జగనన్న చెబితే మొదట్లో అర్థంకాలేదు... సామాన్యుడినైన నాకు ఎంపీ టిక్కెట్టా అని అడిగితే.. సామాన్యుడు ఎంపీ కాకూడదా అంటూ జగనన్న చిరునవ్వుతో బదులిచ్చారు. మా అధినేత నింపిన స్ఫూర్తితో బాపట్ల ఎంపీగా గెలుస్తా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు వినిపిస్తా..’ అని బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్‌బాబు అన్నారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సాగు, తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని... తాను ఎంపీగా గెలుపొందిన వెంటనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఒక సామాన్యుడు ఎంపీ స్థాయికి ఎదగటం, ప్రజాసేవ చేసే అవకాశం రావడం తమ పార్టీ అధినేత గొప్పతనమని అన్నారు. ఎంతో మంది సామాన్యులు తామే ఎంపీ అభ్యర్థిగా ఉన్నామని భావిస్తూ తన గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ప్రశ్న: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడాన్ని ఏవిధంగా భావిస్తున్నారు. జవాబు : ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, చీరాల, అద్దంకి, పర్చూరు, గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలతో కూడిన బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయటం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో మంది ప్రముఖులు గెలుపొందిన ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నా. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచనలేకుండా పనిచేస్తా. బాపట్లను కచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తా. ప్రశ్న: ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? జవాబు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోంది. సీఎం చంద్రబాబునాయుడి పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలపైనే జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రజలు కూడా నవరత్నాలపైనే విశ్వాసంగా ఉన్నారు. సామాన్యుడినైన నాకు ఎంపీగా అవకాశం రావడంతో నేను ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ కనిపిస్తోంది. నా గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడుతున్నాయి. కచ్చితంగా గెలిచి తీరుతా. ప్రశ్న: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యలను గుర్తించారా? జవాబు: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంపై నాకు పట్టు ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించి పట్టుసాధించా. ఈ నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తా. నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు పారిశ్రమికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు శ్రమిస్తా. ప్రశ్న: ప్రచారం ఎలా సాగుతోంది? జవాబు: ఎన్నికల ప్రచారం చాలా చక్కగా సాగుతోంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. బాపట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాటికే ప్రచారం పూర్తిచేశా. ఎక్కడ చూసినా ఫ్యాన్ గాలి వీస్తోంది. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సంక్షేమ పాలన అందుతుందని భావిస్తున్నారు. నవరత్నాలు ఎప్పుడు అందుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రశ్న: నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? జవాబు: బాపట్ల పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా సొంతం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న శ్రీరామ్‌మాల్యాద్రి గత ఐదేళ్లు ఎంపీగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో ప్రజలను కలిసి ఓట్లు అడిగారు. ఆ తరువాత ప్రజలకు కనిపించలేదు. దీంతో ప్రజలు ఆయనపై తీవ్రవ్యతిరేకతతో ఉన్నారు. ఇది నాకు కలిసొచ్చే అంశం. ప్రజలు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రానికి దిక్సూచి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని భావిస్తున్నారు. ప్రశ్న: ఎంపీగా గెలిచాక ఎలా ఉంటారు? జవాబు: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలోనే ఒక సామాన్యుడు ఎంపీ అభ్యర్థిగా వస్తారని ప్రజలు ఊహించలేదు. నేను ఒక సామాన్యుడిగా ప్రజల ముందుకు వచ్చాను. నన్ను ప్రజలు గెలిపిస్తే వారి మధ్యనే ఉంటా. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా. బాపట్ల గల్లీ నుంచే ఢిల్లీకి నా వాణిని వినిపిస్తా. ఒక నాయకుడు ఏవిధంగా ఉండాలో అదే విధంగా ఉండి చూపిస్తా. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతా. -
భావపురి..చైతన్యఝరి
సాక్షి, బాపట్ల : బాపట్లగా పిలువబడే భావపురి కోన ప్రభాకరరావు వంటి ఉద్దండులను అందించింది. కళా సాంస్కృతిక రంగాలకు పెద్ద పీట వేసే ఈ ప్రాంతం.. ధాన్యపు సిరులు కురిపిస్తుంది. ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సూర్యలంక తీరం.. పర్యాటకులను ఆనంద తరంగంలో ముంచెత్తుతుంది. అగ్రికల్చర్ వంటి కళాశాలలతో విద్యా కేంద్రంగా భాసిల్లుతోంది. మత్స్య సందప ఎగుమతితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఎప్పటికప్పుడు రాజకీయ చైతన్యం చూపించే నియోజకవర్గ ప్రజలు నాలుగు సార్లు కోన కుటుంబానికి పట్టం కట్టారు. రాజకీయ చైతన్యం కలిగిన బాపట్ల స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనూ దేశ భక్తిని చాటింది. 1936లో ఆంధ్రప్రదేశ్ అవతరణలో తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశం బాపట్లలోనే జరిగింది. 1950మే 5న బాపట్ల పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అవతరించింది. కమ్యూనిస్టు ఉద్యమాలకు 1950 నుంచి కంచుకోటగా భాసిల్లిన బాపట్ల నియోజకవర్గానికి 1955లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. 1967 తరువాత కాంగ్రెస్ పార్టీ వశమైంది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు పార్టీకి చెందిన వేములపల్లి శ్రీకృష్ణ ఎన్నికయ్యారు. 1967లో నియోజకర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 1983లో తెలుగుదేశం పార్టీ గెలుపొందగా, 1989లో కాంగ్రెస్‌పార్టీ మళ్లీ పాగా వేసింది. 1994,1999లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చరిత్ర కలిగిన బాపట్లలో కోన కుటుంబం నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా చరిత్ర సృష్టించారు. ఇక్కడ కోన కుటుంబానిదే అరుదైన రికార్డు. ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా బాపట్ల నుంచి గెలుపొందారు.1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి వసరుగా 14సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తం 175 రెవెన్యూ గ్రామాలు ఉండగా బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలతోపాటు బాపట్ల మున్సిపాల్టీ ఉన్నాయి. రాజకీయ పాఠశాలను ప్రారంభించిన బాపూజీ బాపట్ల పట్టణంలోని టౌన్‌హాలులో జరిగిన సమావేశానికి 1923లో హాజరైన బాపూజీ మంతెనవారిపాలెంలో రాజకీయ పాఠశాలను ప్రారంభించారు.1950లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ బాపట్లను సందర్శించి రైల్వే స్టేషన్ సమీపంలో కూడలి ప్రదేశంలో ప్రసంగించారు. 1985లో వాజ్‌పేయి కర్లపాలెంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు దీనదయాళ్ అదే సంవత్సరం ఎన్జీవోహోమ్‌లో జరిగిన సభకు హాజరయ్యారు. సూర్యలంక తీరం.. పర్యాటక కేంద్రం బాపట్ల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది సూర్యలంక తీరం. సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ తీరానికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. బాపట్ల పాడి పంటలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం నుంచి ధాన్యం రాష్ట్ర నలుమూలలకు ఎగుమతి అవుతుంది. బాపట్లలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నాయి. ఇలా విద్యా కేంద్రంగా భాసిల్లుతోంది. ముఖ్యమంత్రిగా పని చేసిన నేదురుపల్లి జనార్దన్ రెడ్డి కూడా బాపట్ల ఎంపీగా గెలుపొందారు. పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఇక్కడ పంటలుగా వరి ఎక్కువగా పండుతుంది. వేరుశనగ, ఆక్వా సాగు, చేపల పెంపకం, మొక్కజొన్న సాగు అధికంగా ఉంటుంది. సూర్యలంక తీరం ఉండడంతో మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో విజయాలు 1962లో కొమ్మినేని వెంకటేశ్వరరావు ప్రత్యర్థి మంతెన సత్యవతిపై 1,213 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. 1967లో మూడో సారి కూడా కోన ప్రభాకరరావు కేవీ రావుపై 15,227 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1972లో కోన ప్రభాకరరావు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 2,289 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1978లో కోన ప్రభాకరరావు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 189 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1983లో సీవీ రామరాజు ప్రత్యర్థి కోన ప్రభాకరరావుపై 29,432 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1985లో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రత్యర్థి మంతెన వెంకట సూర్యనారాయణపై 18,027 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో చీరాల గోవర్దన్‌రెడ్డి ప్రత్యర్థి అచ్యుతరామారావుపై 15,583 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1994లో ముప్పలనేని శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి కత్తి పద్మారావుపై 41494 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 1999లో అనంతవర్మరాజు ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుపై 13,845 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో గాదె వెంకటరెడ్డి ప్రత్యర్థి అనంతవర్మరాజుపై 15,569 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2009లో గాదె వెంకటరెడ్డి ప్రత్యర్థి చీరాల గోవర్దన్‌రెడ్డిపై 1,363 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014సంవత్సరంలో కోన రఘుపతి ప్రత్యర్థిపై 5,813 ఓట్లతో ఆధిక్యంతో గెలుపొందారు. బాపట్ల నియోజకవర్గంలో ఓటర్ల వివరాలు ఇలా మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం బాపట్ల 27,093 27,850 1 54,943 బాపట్ల టౌన్ 24,704 26,465 2 51,171 కర్లపాలెం 19,218 19,405 1 38,624 పిట్టలవానిపాలెం 14,321 14,919 2 29,242 మొత్తం 85,336 88,639 6 1,73,981 -
హ్యాట్రిక్ వీరుడు ‘కోన’
సాక్షి, బాపట్ల : బాపట్ల నియోజకవర్గంలో కోన కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. కోన ప్రభాకరరావు బాపట్ల నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అంతేకాకుండా ఆయన తనయుడు కోన రఘుపతి కూడా బాపట్ల నియోజకవర్గం నుంచి ఒక సారి గెలుపొంది రెండో సారీ పోటీలో ఉన్నారు. 1967 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోన ప్రభాకరావు పోటీ చేసి 32,344 ఓట్లు సాధించగా ప్రత్యర్థి కె.వి.రావు సీపీఎం నుంచి పోటీ చేయగా 17,117 ఓట్లు మాత్రమే సాధించారు. మొత్తం 15,227 ఓట్లు తేడాతో ప్రభాకరరావు గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోన ప్రభాకరరావు పోటీపడి 33,314 ఓట్లు సాధించగా, ముప్పలనేని శేషగిరిరావు స్వతంత్ర అభ్యర్థిగా 31,025 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో 2,289 ఓట్ల తేడాతో ప్రభాకరరావు గెలుపొందారు. ఈ సారి 1978లో జరిగిన ఎన్నికల్లో 40,332 ఓట్లు సాధించగా ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుకు 40,143 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కోన పోటీలో ఉండగా జనతా పార్టీ నుంచి ముప్పలనేని పోటీపడ్డారు. నువ్వా...నేనా అనే విధంగా సాగిన ఈ పోటీలో 189 ఓట్ల మెజార్టీతో కోన గెలుపొందారు. అనంతరం ఆయన వారసుడిగా 2014లో జరిగిన ఎన్నికల్లో కోన రఘుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 71,076 ఓట్లు సాధించగా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి అన్నం సతీష్ ప్రభాకర్‌కు కేవలం 65,263ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 5,813 ఓట్లు మెజార్టీతో కోన రఘుపతి గెలుపొందారు. -
ఆడపడుచులకు చేయూత
సాక్షి, బాపట్ల : తరాలు మారినా.. తలరాతలు మారని పరిస్థితి వారిది. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సుమారు 1.20 లక్షల మంది ఉన్నారు. వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేంతవరకు ఆయా కులవృత్తుల్లో నిమగ్నమైన జీవనాన్ని గడుపుతూ జీవిస్తుంటారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. పాలకులు ఎందరొచ్చినా వీరి జీవనస్థితిలో మాత్రం ఎదుగుబొదుగు లేకుండా పోతుంది. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పలు చెప్పుకునే పాలకులు నిజజీవితంలో మాత్రం వాటిని ఎక్కడా కూడా అమలు చేస్తున్న దాఖలాలు కనుచూపుమేరల్లో కనిపించడం లేదు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను కేవలం ఓటు బ్యాంకింగ్ కోసమే ఉపయోగించుకునే టీడీపీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పేదల అభ్యున్నతి కోసం మేము కట్టుబడి ఉన్నాం.. పేదలకు అన్నివిధాల అండగా ఉంటామంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో గెలిచిన ఐదేళ్లు గడిచేంతవరకు ఏ నాడు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద 45 ఏళ్లకే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, నాలుగేళ్లలో మహిళలకు రూ.75 వేలు వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా ఇస్తానని ప్రకటించడంతో మహిళాలోకం ఆనందంగా ఉంది. కష్టపడినా ఫలితం శూన్యం ఏళ్ల తరబడి బుట్టల అల్లికే ప్రధాన వృత్తిగా చేసుకుంటూ జీవిస్తున్న నిరుపేదలు ప్రస్తుతం మార్కెట్లో విరివిగా ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల విక్రయాల వల్ల పూట గడవని స్థితిలో ఆకలి కేకలతో ఆలమటిస్తున్నారు. ఇలాంటి సమయంలో వాళ్లను ఆదుకోవాల్సిన పాలకులు, అధికారులు కనీసం ఆదిశగా ఆలోచించకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్డాడుతున్నారు. బాపట్ల మండలంలోని కనకాద్రినగర్, కర్లపాలెం మండలంలోని ఎస్టీకాలనీ, పిట్టలవానిపాలెం మండలంలోని కాలువకట్టపై జీవనం సాగించే ఎస్టీలు పదేళ్లుగా జీవనం సాగిస్తున్న ఎస్టీలకు వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి బుట్టల అల్లిక. వీరంతా సూర్యలంక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈత చెట్లను పాడుకొని ఈత సువ్వలను కోస్తారు. కోసిన ఈత సువ్వలను 15 రోజులు ఎండిన తర్వాత వాటిని ఇంటికి చేర్చుకుని బుట్టల అల్లిక ప్రారంభిస్తారు. రోజంతా భార్య, భర్త కలిసి 4 బుట్టలు మాత్రమే అల్లుతారు. వాటిని మార్కెట్లో విక్రయిస్తే రూ. 120 నుంచి 150 వరకు వస్తాయి. వాటితోనే కుటుంబం మొత్తం పోషించుకోవాలి. గతంలో ఏ గ్రామానికి బుట్టలు తీసుకెళ్లినా వెంటనే కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువులు విరివిగా వాడుకలోకి రావడంతో ఈత సువ్వలతో తయారుచేసిన బుట్టలను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకురావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎదుగు బొదుగు లేని బీసీ బతుకులు ఇదిలా ఉండగా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తాం. ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తామంటూ ఇచ్చిన హామీలను మరిచారు. కనీసం 120 పైగా కులాలు ఉన్న బీసీల అభ్యున్నతి గురించి ఏనాడు ఆలోచించిన దాఖలాలు లేవు. బీసీల్లో ప్రధాన కులాలు అయిన యాదవులు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రేంతవరకు గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కనీసం వారికి సబ్సిడీపై గొర్రెలను అందించిన దాఖలాలు లేవు. అదేవిధంగా గౌడ కులస్తులకు ఏళ్ల తరబడి కల్లుగీతనే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వారి జీవితాల్లో కూడా అభివృద్ధి అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగానే మారింది. నాయీబ్రహ్మణులు, రజకులు, వడ్డెర, పద్మశాలీలు, విశ్వబ్రహ్మణులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ఏం చేయని చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆదరణ పథకం అంటూ మరోసారి బీసీలను మోసగించే ప్రయత్నానికి తెరలేపారు. పేదలకు మేలు చేసే పథకం వైఎస్సార్ చేయూత పథకం ద్వారా పేదలు ఆర్థికంగా చేయూత అందుతుంది. కనీసం పూటగడవని నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని నిరుపేదలకు 45 సంవత్సరాలకే పింఛన్ సౌకర్యం కల్పించేవిధంగా హామీ ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయం. దేశ చరిత్రలో మరెవ్వరూ ఇవ్వనటువంటి హామిను ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేశారు. ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడనే నమ్మకం ఉంది. -నర్రా ధనలక్ష్మి, మంతెనవారిపాలెం మహిళలకు ఆర్థిక భరోసా వైఎస్సార్ చేయూత పథకం మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చే పథకం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. పేద, బడుగు, బలహీన వర్గాల్లోని మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ అందించే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. -మద్దికర ఝాన్సీలక్ష్మి, భవనంవారిపాలెం -
మడమ తిప్పని హామీకే..మద్దతు
సాక్షి, బాపట్ల : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)తో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారనున్నాయి. సీపీఎస్ విధానం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఈ విధానం అమలుచేయడం వల్ల ఉద్యోగులు పదవీ విరమణ తరువాత ఎలాంటి జీవితాన్ని గడపాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. షేక్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామీ ఉండదని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు సంవత్సరాల తరబడి పోరాటాలు చేస్తున్నాయి. పదవీ విరమణ తరువాత భద్రత లేని జీవితాన్ని గడపాల్సి వస్తుందని సీపీఎస్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సీపీఎస్ వల్ల సంకట పరిస్థితులు ఏళ్ళ తరబడి పోరాటాలు చేసి సాధించుకున్న పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంకట పరిస్థితుల్లో పడ్డారు. సీపీఎస్ విధానాన్ని 2004 సెప్టెంబర్ ఒకటో తేది నుంచి ప్రభుత్వం అమలు చేసింది. సీపీఎస్‌ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వానిదేనంటూ రాష్ట్ర ప్రభుత్వం కుంటిసాకులు చెబుతూ కాలయాపన చేస్తోంది. ఉద్యోగుల ఆందోళన సీపీఎస్ రద్దు కోరుతూ రాష్ట్రంలో 1.80లక్షల మంది ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో సుమారు 15వేలకు పైగా సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగులను అరెస్ట్ చేయడం, ధర్నాలు, ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేయించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఉద్యోగులు ఖండిస్తున్నారు. ఎన్నో ఆందోళనలు చేశామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్ హామీ ఇచ్చారు. జననేత ఇచ్చిన హామీపై సీపీఎస్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాత పెన్షన్ విధానంతో కలిగే లాభాలు ప్రభుత్వ హామి ఉంటుంది. సంవత్సరానికి రెండు డీఏలు, ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీతో పెన్షన్ మొత్తం పెంపు పదవీ విరమణ తర్వాత హెల్త్‌కార్డులు ఉద్యోగులు పెన్షన్ నిర్వహణ చార్జీలు చెల్లించే అవసరం లేదు. పెన్షన్‌కు ప్రతినెలా చందా చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగి మరణించేంతవరకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది. గ్రాట్యూటీ, కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది. జీవితాంతం పెన్షన్ మొత్తానికి ఢోకా ఉండదు సీపీఎస్‌తో కలిగే నష్టాలు షేర్ మార్కెట్ ఆధారిత పెన్షన్ కావడంతో ప్రభుత్వ హామి ఉండదు. ఎంచుకున్న ఆన్‌డ్యూటీ ఫ్లాన్ ఆధారంగా పెన్షన్‌మొత్తం పెరగవచ్చు, తగ్గవచ్చు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ప్రాన్‌ఖాతాలో నిర్వహణ చార్జీలు చెల్లించాలి. ప్రతినెలా మూలవేతనంతోపాటు డీఏలో 10 శాతం చందా చెల్లించాలి. ఉద్యోగులు పదవీవిరమణ చేసేంతవరకు 10 శాతం మాచింగ్ గ్రాంట్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. పదవీవిరమణ తరువాత ఎలాంటి తోడ్పాటు ఉండదు. కుటుంబ పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ప్రాన్ ఖాతాలో మొత్తం సొమ్ము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. రద్దుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది గతంలో ఆర్టీఐ చట్టం కింద సీపీఎస్ విధానం రద్దు చేసే అధికారం ఎవరిది అని కేంద్రానికి ఒక లేఖ రాశాం. దాని ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశాం. ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సీపీఎస్‌ను రద్దు చేసి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. పాత పెన్షన్ విధానంతో మాకు ఎంతో మేలు చేకూరుతుంది. – ఆయూబ్, వీఆర్వో ఉద్యోగులను బిచ్చగాళ్లను చేస్తోంది సీపీఎస్ విధానం ఉద్యోగులను పదవీవిరమణ తర్వాత బిచ్చగాళ్లుగా మార్చేవిధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని ఉపయోగించి సీబీఐకి సాధారణ సమ్మతిని తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం మన భారతరాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఉన్న అర్టికల్ 246(3) ప్రకారం, అర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, సర్వీస్ మాటర్స్‌కు సంబంధించి పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని తెలిసి సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకుండా తీర్మానాలు, కమిటీలు, కేంద్రానికి లేఖలు అనే పేరుతో కాలయాపన చేయడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమే. – కె. పార్ధసారథి, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి -
మద్యం పై యుద్ధం
సాక్షి, బాపట్ల : ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లిన భర్త తూలుతూ వస్తాడు.. నాన్న వస్తే పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు అడుగుదామని గుమ్మం వద్ద ఎదురుచూస్తూ ఉన్న కూతురికి తన తండ్రి నోటివెంట వచ్చే మద్యం వాసన గుప్పుమంటుంది. ప్రెండ్స్‌తో పార్టీలో ఉన్నానని భర్త ఫోన్ చేసి చెబుతాడు. కళాశాలకు వెళ్లే కుర్రాడి గదిలో బీరుబాటిల్స్ దర్శనమిస్తుంటాయి. నెలఖర్చులు జమచేసేందుకు జీతం డబ్బులు లెక్కేస్తే మిగిలినవి కనిపించని పరిస్థితి. రోజంతా కాయాకష్టంచేసి ఉన్నదంతా మద్యానికి తగలేసి ఇంటిల్లిపాదీ పస్తులు పెట్టే మహానుభావులు కూడా ఎందరో... కుటుంబాలను ఎంతో నాశనం చేస్తున్న ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే కారణం మద్యం. దురలవాటుల వల్ల మాత్రమే ఈ నష్టాలకు కారణం అనుకుందామనుకుంటే.. ప్రభుత్వం మరో కారణంగా ఉండడం బాధాకరం. మద్యం విక్రయాలు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందన్న ఆర్థిక సూత్రాన్ని తరతరాలుగా పాలకులు ఫాలో అవుతున్నారు. ఎన్నికలకు మందు గ్రామానికి ఓ మహిళా కానిస్టేబుల్‌ను నియమిస్తాం.. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు లేకుండా చూస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాలకు తాగునీటికన్నా కూడా మద్యమే అందుబాటులో ఉండేలా వీధికొకషాపు చొప్పున ఏర్పాటు చేయించారు. తొలిసారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మద్యాన్ని దశలవారీగా నిషేధిస్తామని నవరత్న పథకాల్లో ప్రకటించారు. అది ఎలా నిషేధిస్తారో కూడా ప్రణాళికను ప్రజల ముందు ఉంచారు. బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల పట్టణం, మండలం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలో 22 మద్యం దుకాణాలు 4 బార్లు ఉన్నాయి. సుమారు నియోజకవర్గంలో 50కు పైగా అనధికారికంగా బెల్టుషాపులు ఉంటాయని మహిళలు అరోపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాక్షేత్రంలో పర్యటించినప్పుడు మహిళల బాధలు నేరుగా చూశారు. బరువెక్కిన హృదయాలతో వారు చెప్పిన మాటలు విని చలించిపోయారు. ఇళ్ల మధ్యనే మద్య దుకాణాలు ఉండడంతో చిన్నపిల్లలు సైతం వెసనపరులుగా మారుతున్నారంటూ జననేత వద్ద మహిళలు అవేదన చెందారు. మద్యపాన నిషేధానికి పెద్దపీట మద్యం ఎంతగా పేదల కుటుంబాలను కుంగతీస్తుందో కళ్లారా చూసిన జగన్ నవరత్నాల్లో మద్యపాన నిషేధానికి పెద్దపీట వేశారు. ఐదేళ్లల్లో శాస్త్రీయ పద్ధతిలో దశలవారీగా మద్యం నిషేధిస్తామంటూ పార్టీ జాతీయ ప్లీనరీలో ప్రకటన చేశారు. ఉత్తుత్తి హామీ కాకుండా నిషేధం ఏ పద్ధతిలో చేస్తానో కూడా వివరించడంతో జగన్మోహన్రెడ్డిపై మహిళలకు నమ్మకం కలిగింది. దేవుని దయవలన ప్రజలందరి ఆదరణ వల్ల ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనలో మద్య విక్రయాలను ఏడాదికాఏడాది తగ్గిస్తూ మద్యం మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రణాళికను రూపొందించారు. దీంతో కారుచీకట్లో కాంతిపుంజంలా మహిళలకు జగన్మోహన్రెడ్డిపై అభిమానం పెరిగింది. ఆయన అధికారంలోకి వచ్చి మద్యాన్ని నిషేధిస్తే సామాన్య కుటుంబాలు ఎన్నో బాగుపడుతాయంటూ ప్రజా ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు. తప్పక నెరవేరుస్తారనే విశ్వాసం గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం తాగటానికి నీళ్లులేక ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం అసలు చర్యలు తీసుకోవడం లేదు. కానీ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు పెట్టి ఖజానా నింపుకుంటున్నారు. ఐదేళ్ల నుంచి గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. సంపాదించిన సొమ్మంతా మగవారు తాగుడుకే తగలేయడంతో కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నమయ్యాయి. జగనన్న ప్రకటించిన మద్యపాన నిషేధ హామీ తప్పక నేరవేరుస్తారని విశ్వాసం ఉంది. – కొండా అన్నమ్మ రాజన్న బిడ్డ.. మాట నిలబెట్టుకుంటాడు తెలుగు ప్రజల దైవం.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలుబెట్టుకుంటాడన్నా విశ్వాసం మాలో ఉంది. ఐదేళ్లపాటు చంద్రబాబు పాలన చూసిన తర్వాత జగనన్నకు ఓ అవకాశం ఇచ్చి చూడాలన్న ఆలోచన ప్రజలందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని విడతల వారీగా నిషేధిస్తామని నవరత్నాల్లో ప్రకటించడం మహిళల్లో భరోసా నింపుతుంది. –షేక్ ఫాతిమా -
'మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం'
బాపట్ల: రైతులను జైల్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్ షర్మిల విమర్శించారు. తన పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు, 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. బషీర్‌బాగ్ కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలను కాకుండా పోలీసులను పరామర్శించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. విభజన ఒక వాస్తవం.. దానికి కారణం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలే కారణమన్నారు. అడ్డగోలు విభజనకు చంద్రబాబు లేఖే కారణమని చెప్పారు. మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం, జగనన్నను సీఎం చేసుకుందాం అని షర్మిల పిలుపునిచ్చారు. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కే.రఘుపతిని షర్మిల ప్రకటించించారు. రానున్న మున్సిపల్, జిల్లా, మండల పరిషత్‌తోపాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలంటూ షర్మిల కోరారు. -
బీజేపీలో చేరేది లేదు
తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి స్పష్టం చేశారు. గురువారం గుంటూరు విచ్చేసిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. తాను తుది శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు తనకు సహకరించడం లేదని పనబాక లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆశించినంతగా అభివృద్ధి చేయలేకపోయానని చెప్పారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తనకు రాజ్యసభ సీటు కేటాయిస్తే కాదనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలో ఓట్లు గల్లంతు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ బీజేపీలో చేరతారని ఊహగానాలు ఊపందుకున్నాయి. దాంతో గుంటూరు విచ్చేసిన పనబాకను ఆ అంశంపై ప్రశ్నించారు. దీంతో పనబాక లక్ష్మిపై విధంగా స్పందించారు.