'మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం' | We will decide our future, says YS Sharmila in Bapatla | Sakshi
Sakshi News home page

'మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం'

Published Sun, Mar 23 2014 1:00 PM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

'మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం'

'మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం'

బాపట్ల: రైతులను జైల్లో పెట్టించిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్ షర్మిల విమర్శించారు. తన పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు, 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుదే అన్నారు. బషీర్‌బాగ్ కాల్పుల్లో మరణించినవారి కుటుంబాలను కాకుండా పోలీసులను పరామర్శించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు.

విభజన ఒక వాస్తవం.. దానికి కారణం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలే కారణమన్నారు. అడ్డగోలు విభజనకు చంద్రబాబు లేఖే కారణమని చెప్పారు. మన భవిష్యత్ మనమే నిర్మించుకుందాం, జగనన్నను సీఎం చేసుకుందాం అని షర్మిల పిలుపునిచ్చారు. బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా కే.రఘుపతిని షర్మిల ప్రకటించించారు. రానున్న మున్సిపల్, జిల్లా, మండల పరిషత్‌తోపాటు ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలంటూ షర్మిల కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement