గుజరాత్ వృద్ధి మిథ్యే
రూ.10 వేల లోపు అప్పు సైతం చెల్లించలేక
ఆత్మహత్య చేసుకుంటున్న రైతులు
ప్రజల సొమ్ముల్ని రాయితీల రూపంలో కొట్టేస్తున్న బడా కార్పొరేట్లు
అవకాశమిస్తే దేశాన్నే గుజరాత్‌లా చేస్తానంటున్నారు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. కానీ నిజానికి గుజరాత్‌లో జరిగింది ఎలాంటి అభివృద్ధి? ఎవరి అభివృద్ధి? వృద్ధి రేటు అద్భుతమంటూ ఊదరగొడుతున్న గుజరాత్‌లో వాస్తవ పరిస్థితేమిటో తెలుసా? అభివృద్ధి అంటే ఆత్మహత్యలు. అభివృద్ధి అంటే భయోత్పాతం. అభివృద్ధి అంటే కార్పొరేట్లకు ఎర్ర తివాచీలు. సగటు జీవికి మాత్రం నిత్యం ఆకలి కేకలు! ఇలాంటి వృద్ధినే దేశవ్యాప్తం చేస్తానంటూ మోడీ ఊరూవాడా ఎలుగెత్తి చాటుతున్నారు! అలాంటి మోడీ మోడల్‌కు చంద్రబాబు వంతపాడుతున్నారు. తానూ అలాంటి అభివృద్ధికే కంకణం కట్టుకున్నానంటున్నారు.
మోడీ సారథ్యంలో గుజరాత్ సాధించిన ‘అభివృద్ధి’ ఎలాంటిదో చూడండి...
హా సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం గుజరాత్‌లో 2003-2012 మధ్య 4,874 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మోడీ వూత్రం ఒకే ఒక్క రైతు ఆత్మహత్య చేసుకున్నాడని బుకారుుస్తున్నారు.
1. 2011 నాటికి మోడీ విధానాల సంక్షోభం 16,000 మంది ఆత్మహత్యలకు కారణమైంది. గుజరాత్ ప్రభుత్వ లెక్కల ప్రకారం - ఇందులో 9,829 మంది కార్మికులు. 919 మంది వ్యవసాయ కార్మికులు. మిగిలిన వాళ్లు రైతులు.
2. 2001-11 మధ్య గుజరాత్‌లో 3.5 లక్షల మంది రైతులు సాగు నుంచి తప్పుకున్నారు. వ్యవసాయ కార్మికులు 16.78 లక్షలకు పెరిగారు. ఎన్‌ఎస్‌ఎస్ సర్వే (2005) ప్రకారం - 40% రైతులు వేరే బతుకు తెరువు దొరికితే సాగును వదిలేం దుకు సిద్ధంగా ఉన్నారు.
3. ప్లానింగ్ కమిషన్ నియమించిన సురేష్ పి టెండూల్కర్ కమిటీ ప్రకారం - గుజరాత్ ప్రజల్లో 31.8% మంది పేదలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర 7 రాష్ట్రాల కంటే ఎక్కువ పేదరికం ఇక్కడ నమోదైంది.
4. 2008 రాష్ట్రాల ఆకలి సూచిలో ఈ ‘ధనిక’ రాష్ట్రం ఒడిశా కంటే వెనుకబడింది. మొత్తం 17 పెద్ద రాష్ట్రాల్లో 13వ స్థానంలో ఉంది.
5. గత పదేళ్లలో గుజరాత్‌లో 60,000 చిన్న పరిశ్రమలు మూతబడ్డాయి. కుటీరపరిశ్రమల ద్వారా ఉపాధి పొందే వారి సంఖ్య 85,683 మేరకు క్షీణించింది.
6. 2001లో 18.86 లక్షలున్న మహిళా రైతుల సంఖ్య 2011 నాటికి 12.03 లక్షలకు పడిపోయింది.
7. గుజరాత్‌లోని మొత్తం కార్మికుల్లో మహిళా కార్మికులు 2.89% మాత్రమే.(జాతీయ సగటు 12.5%).
8. 2004-05, 2009-10 మధ్య ఉపాధి వృద్ధిరేటు 1.3%
9. అత్యధిక పెట్టుబడులున్న తయారీరంగంలో 2011-12 మధ్య ఉద్యోగుల సంఖ్య 0.68% మేర క్షీణించింది. 2001-08 మధ్య ఎలాంటి సాంఘిక భద్రతా లేని కాంట్రాక్టు కార్మికులు 19 నుంచి 34 శాతానికి పెరిగారు. వీరికి చెల్లిస్తున్న వేతనాలు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ.
10. గుజరాత్‌లోని ఫ్యాక్టరీ కార్మికులు జార్ఖండ్, మహారాష్ట్రల కన్నా 30% నుంచి 40% తక్కువ వేతనాలు పొందుతున్నారు. వేతనాలపరంగా గుజరాత్ క్యాజు వల్ కార్మికులు దేశంలోనే చివరన ఉన్నారు.
11. 1990 దశకంలో 3.7 శాతంగా ఉన్న వేతనాల వృద్ధిరేటు 2000 దశకంలో 1.48కి పడిపోయింది. 2011 ఆర్థిక సర్వే ప్రకారం గుజరాత్‌లో జరిగినన్ని సమ్మెలు మరే రాష్ట్రంలోనూ జరగలేదు.
(ఇవన్నీ గుజరాత్ చేపట్టిన కార్పొరేటీకరణ దుష్పరిణామాలే)
అభివృద్ధి సూచీల్లో నానాటికీ వెనక్కి
జాతీయ మానవాభివృద్ధి సూచిలో గుజరాత్ ర్యాంకు తొమ్మిది. 1999-2000 నుంచి ఇదే స్థితి! ఇక అక్షరాస్యత రేటులో 12వ ర్యాంకు. 1-10 తరగతుల మధ్య బడి మానేస్తున్న వారు 58% (జాతీయ సగటు 49%). 2013 నాటికి ప్రాథమిక విద్యారంగంలో 12 నుంచి 28వ స్థానానికి, ప్రాథమికోన్నత విద్యారంగంలో 8 నుంచి 14కు దిగజారింది. ప్రాథమిక విద్యారంగంలో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి వెనకబడిన రాష్ట్రాలు కూడా గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నాయి. విద్యారంగ పెట్టుబడుల్లో గుజరాత్ స్థానం 14. విద్యారంగంలో సామాజిక అసమానతలు కూడా అక్కడ చాలా ఎక్కువ. ముస్లిం పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లే లభించడం లేదు!
మౌలిక ఆరోగ్య సూచికల్లోనూ గుజరాత్ వెనుకబడింది. ఆర్యోగ రంగంలో 17 పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ స్థానం 16! ఇక మాతృ మరణాల రేటు ప్రతి లక్ష మందికి 148. ఈ విషయంలో తమిళనాడు (97), మహారాష్ట్ర (104) చాలా మెరుగ్గా ఉన్నాయి. శిశు మరణాల రేటు గుజరాత్‌లో ప్రతి 1,000 మందికి 41 కాగా మహారాష్ట్రలో 25, తమిళనాడులో 22. ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు గుజరాత్‌లో 61 (ప్రతి వెయ్యిమందికి). మహారాష్ట్రలో 28. తమిళనాడులో 25. తమిళనాట 1992-93 మధ్య 90 పాయింట్లు ఉన్న షెడ్యూల్ట్ కులాల శిశు మరణాల రేటు 2005-06 నాటికి 37 పాయింట్లకు తగ్గింది. గుజరాత్‌లో ఇది 5 పాయింట్లకు మించి తగ్గలేదు. గుజరాత్‌లో 2005-06 నాటికి ఎస్టీల్లో శిశు మరణాల రేటు జాతీయ సగటు (62) కంటే చాలా ఎక్కువ(86). రాష్ట్ర పేదల్లో సగంమంది సబ్సిడీ ధాన్యాలు పొందలేకపోతున్నారు. సమగ్ర శిశు సంక్షేమ పథకం, మధ్యాహ్న భోజన పథకాన్ని మెరుగ్గా అమలు పరిచే రాష్ట్రాల్లో గుజరాత్ లేదు.
గుజరాత్ నమూనా అంటే.. బడా పెట్టుబడుదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం. సామాన్యుల్ని, ప్రత్యేకించి బడుగుల్ని విస్మరించడం. మోడీ నాయకత్వంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వమే గనుక ఏర్పడితే పెట్టుబడుదారులు సుస్థిర లాభాలకు బాటలేసుకోవచ్చు. సామాన్యుల జీవన భద్రత మాత్రం కల్ల.
తగ్గిన సామాజిక వ్యయం
2013-14 గుజరాత్ బడ్జెట్ వ్యయంలో సామాజిక రంగానికి కేటాయించింది 39.1% (జీఎస్‌డీపీలో 5.5%). ఈ అంశంలో - మొత్తం 17 రాష్ట్రాల వరసలో గుజరాత్‌ది 16వ స్థానం. ప్రభుత్వ ఖజానాలోని ప్రజల సొమ్ము భారీగా కార్పొరేట్ సంస్థల పరమవ్వడం, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడం వల్ల సావూజికరంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. కార్పొరేట్ సంస్థలకు భారీ రారుుతీలు ఇవ్వడంపై గతంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలో పలు కార్పొరేట్ సంస్థలకు కోర్టు నోటీసులిచ్చింది.