![మోడీది అధికార దాహం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51398979967_625x300.jpg.webp?itok=X6hz7PCt)
మోడీది అధికార దాహం
బల్‌రాంపూర్/ఫైజాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై సోనియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ అధికార దాహంతో ఉన్నారని, ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే తనను తాను ప్రధానిగా భావిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ‘మోడీ అధికార వ్యామోహంతో ఊగిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వచ్చేసినట్టుగా, ఆయన ప్రధాని అయిపోయినట్టుగా భావిస్తున్నారు’ అని సోనియా ఎద్దేవా చేశారు. ఈ మేరకు యూపీలోని బల్‌రాంపూర్, ఫైజాబాద్‌లలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీపై సోనియా నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలనే విషయం నిర్ణయించాల్సింది ప్రజలేనన్న అంశాన్ని మోడీ విస్మరిస్తున్నారని చురకలంటించారు.