మీ లౌకికవాదం ఏపాటిది?: మోడీ | Narendra Modi challenges Sonia Gandhi's secularism | Sakshi
Sakshi News home page

మీ లౌకికవాదం ఏపాటిది?: మోడీ

Published Sat, May 3 2014 4:27 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM

మీ లౌకికవాదం ఏపాటిది?: మోడీ - Sakshi

మీ లౌకికవాదం ఏపాటిది?: మోడీ

సోనియాకు మోడీ సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగిన మత ఘర్షణలపై ఏవిధంగా వ్యవహరించారో అందరికీ తెలిసిందేనని దుయ్యబట్టారు. సోనియాగాంధీ ప్రవచిస్తున్న లౌకికవాదాన్ని తాను చాలెంజ్ చేస్తున్నాన న్నారు. ‘మీ లౌకికవాదం ఏపాటిది? కాంగ్రెస్ పాలిత రాజస్థాన్‌లో జరిగిన మత ఘర్షణల్లో బాధితులకు మీరెలాంటి న్యాయం చేశారు?’ అని మోడీ ప్రశ్నించారు.
 
 ఈ మేరకు తదుపరి రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న 107 లోక్‌సభ నియోజకవర్గాల్లో 3-డి ద్వారా శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. హిందువులు లేదా ముస్లింల కోసం సోనియా కలత చెందడం లేదని, ఆమె తన కుమారుడికి అధికారం కట్టబెట్టడం కోసమే బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement