'మోడీని కసాయి అంటే కసాయి కూడా సిగ్గుపడతాడు' | Even butchers are shy of being compared to Modi: Lalu Prasad Yadav | Sakshi
Sakshi News home page

'మోడీని కసాయి అంటే కసాయి కూడా సిగ్గుపడతాడు'

Published Tue, Apr 29 2014 12:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'మోడీని కసాయి అంటే కసాయి కూడా సిగ్గుపడతాడు' - Sakshi

'మోడీని కసాయి అంటే కసాయి కూడా సిగ్గుపడతాడు'

బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ మంగళవారం తనదైన శైలిలో విమర్శించారు. మంగళవారం న్యూఢిల్లీలో లాలూ మాట్లాడుతూ... నరేంద్ర మోడీని కసాయితో కూడా పోల్చలేమని అన్నారు. ఓ వేళ అలా పోల్చిస్తే కసాయి కూడా సిగ్గుపడతాడని లాలు విమర్శించారు. అలాంటి వ్యక్తి దేశ ప్రధాని పదవికి ఎలా అర్హుడవుతాడని ఆయన ప్రశ్నించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ వేసిన పెయింటింగ్ రూ.1.80 కోట్లుకు అమ్ముడైంది. ఈ నేపథ్యంలో ఆ పెయింటింగ్ కొనుగోలుపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. దాంతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు మోడీ విమర్శలపై స్పందిస్తూ... ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో నరమేథం సృష్టించిన కసాయి అంటూ నరేంద్ర మోడీని అభివర్ణించారు. అందులోభాగంగా సొంత భార్యను జాగ్రత్తగా చూసుకోని మోడీ... దేశాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటారంటూ సోమవారం టీఎంసీ నేతలు మోడీని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో టీఎంసీ నాయకులు మోడీ వ్యాఖ్యలపై లాలు మంగళవారంపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement