ప్రత్యర్థులంటే మోడీకి చులకన..: రాహుల్ | Rivals disparaging Modi ..: Rahul | Sakshi
Sakshi News home page

ప్రత్యర్థులంటే మోడీకి చులకన..: రాహుల్

Published Tue, Apr 29 2014 2:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ప్రత్యర్థులంటే మోడీకి చులకన..: రాహుల్ - Sakshi

ప్రత్యర్థులంటే మోడీకి చులకన..: రాహుల్

భటిండా(పంజాబ్): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తన ప్రత్యర్థులను చులకన చేసి మాట్లాడుతున్నారని, ఎన్నికల ప్రచారం సందర్భంగా పరుష పదజాలం వాడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆక్షేపించారు. అవినీతిపైనా మోడీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని, అలాగే కొద్దిమంది పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గుజరాత్‌లో అభివృద్ధి మొత్తం తన ఒక్కడి వ్యక్తిగత విజయంగానే చెపుతూ..

లక్షలాదిమంది గుజరాతీయులు, అమూల్ బ్రాండ్‌ను విజయవంతం చేసేందుకు శ్రమించిన మహిళల కష్టాన్ని మరుగున పరిచేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ సోమవారం పంజాబ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్ బంధువు.. మన్‌ప్రీత్‌సింగ్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్.. మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement