కోన ప్రభాకర్ రావు, కోన రఘుపతి
సాక్షి, బాపట్ల : బాపట్ల నియోజకవర్గంలో కోన కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. కోన ప్రభాకరరావు బాపట్ల నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. అంతేకాకుండా ఆయన తనయుడు కోన రఘుపతి కూడా బాపట్ల నియోజకవర్గం నుంచి ఒక సారి గెలుపొంది రెండో సారీ పోటీలో ఉన్నారు. 1967 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోన ప్రభాకరావు పోటీ చేసి 32,344 ఓట్లు సాధించగా ప్రత్యర్థి కె.వి.రావు సీపీఎం నుంచి పోటీ చేయగా 17,117 ఓట్లు మాత్రమే సాధించారు.
మొత్తం 15,227 ఓట్లు తేడాతో ప్రభాకరరావు గెలుపొందారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కోన ప్రభాకరరావు పోటీపడి 33,314 ఓట్లు సాధించగా, ముప్పలనేని శేషగిరిరావు స్వతంత్ర అభ్యర్థిగా 31,025 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో 2,289 ఓట్ల తేడాతో ప్రభాకరరావు గెలుపొందారు. ఈ సారి 1978లో జరిగిన ఎన్నికల్లో 40,332 ఓట్లు సాధించగా ప్రత్యర్థి ముప్పలనేని శేషగిరిరావుకు 40,143 ఓట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ నుంచి కోన పోటీలో ఉండగా జనతా పార్టీ నుంచి ముప్పలనేని పోటీపడ్డారు. నువ్వా...నేనా అనే విధంగా సాగిన ఈ పోటీలో 189 ఓట్ల మెజార్టీతో కోన గెలుపొందారు. అనంతరం ఆయన వారసుడిగా 2014లో జరిగిన ఎన్నికల్లో కోన రఘుపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 71,076 ఓట్లు సాధించగా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ నుంచి అన్నం సతీష్ ప్రభాకర్‌కు కేవలం 65,263ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం 5,813 ఓట్లు మెజార్టీతో కోన రఘుపతి గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment